ఏపీకి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయిరెడ్డి

రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఏపీకి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. విభజనతో ఏపీ రాజధానిని కోల్పోయిందన్నారు. హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని కేంద్రం వితండవాదన చేస్తుందని తప్పుపట్టారు. ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలా, ఇతర రాష్ట్రాలను మరోలా చూడటం సరికాదన్నారు. పుదుచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ వాగ్ధానం చేసిందని గుర్తు చేశారు. పుదుచ్చేరికి సాధ్యమైంది..ఏపీకి ఎందుకు సాధ్యం కాదని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.  ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ప్రజలను శిక్షించడం సరికాదని తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top