ఆల‌య నిర్మాణాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ 

అమ‌రావ‌తిలో ఆలయ పనులు మరింత వేగవంతం

టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి : అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి ఆరు నెలల్లో విగ్రహాలు తయారవుతాయని టీటీడీ  చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేడు తిరుపతి సమీపంలోని రామాపురంలో శిలలకు పూజా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఆర్నెళ్లలోగా విగ్రహాల తయారీ పూర్తి చేయనున్నట్లు శిల్పులు తెలిపారన్నారు. ఈ క్రమంలో అమరావతిలో ఆలయ పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో టీటీడీ పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలలో ఆలయాలు నిర్మించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తాము తిరిగి ఆలయాల నిర్మాణంపై శ్రద్ధ వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆగమోక్తంగా శ్రీవారి విగ్రహాలు తయారవుతున్నాయని తెలిపారు.

Back to Top