విభజన హామీలు, హోదా సాధించే దిశగా కృషి

ఆంధ్రరాష్ట్రానికి అత్యధిక కేటాయింపులు జరిగేలా పోరాడుతాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్‌లో ఆంధ్రరాష్ట్రానికి మేలు చేకూర్చే ఏ ఒక్క అంశాన్ని ప్రస్తావించలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల డిమాండ్‌ ప్రత్యేక హోదాపై ప్రస్తావనే లేదన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలపై కేంద్రం వివరణ ఇవ్వలేదన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్‌ చర్చలో, డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, హామీల గురించి వైయస్‌ఆర్‌ సీపీ గట్టిగా పోరాడుతుందన్నారు.

ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని కేంద్రం ప్రకటించిందని, ఆ పథకం ఎలా అమలు చేస్తారో పరిశీలిస్తామన్నారు. అదే విధంగా ఈ ఒక్క ఏడాదిలోనే కోటి 95 లోల ఇళ్లు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిందని, ఆంధ్రరాష్ట్రానికి దాదాపు 26 లక్షల ఇళ్లు అవసరమన్నారు. రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చేలా కృషిచేస్తామన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీకి గత సంవత్సరం రూ. 55 వేల కోట్లు ఇస్తే.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 60 వేల కోట్లు కేటాయించారని, దాంట్లో కూడా అత్యధిక వాటా ఏపీకి వచ్చేలా పట్టుబడతామన్నారు.

Back to Top