వైయస్‌ఆర్‌కు స్పీకర్‌ తమ్మినేని సీతారాం నివాళి

శ్రీకాకుళం: ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో స్పీకర్‌ పాల్గొని మహానేత విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రోగులు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. 
నరసన్నపేటలో నిర్వహించిన వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వైయస్ రాజశేఖరరెడ్డివిగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Back to Top