శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస నియొజకవర్గంలో వైయస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. నాడు టీడీపీ అధినేత చంద్రబాబు వెనుకబడిన వర్గాలను అవహేలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనగారిన వర్గాల ప్రజలను అణగద్రొక్కే పరిస్థితులలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారు అని స్పీకర్ గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలు నేడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో వెళ్లేందుకు కృతనిచ్చయంతో ఉన్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నేడు వెనుకబడిన వర్గాల వారికి ఆత్మగౌరవం పరిరక్షించే అవకాశం వచ్చింది అని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. మళ్లీ మళ్లీ సీఎంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకొవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని ఆయన పేర్కొన్నారు. వైయస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు ప్రజలు తండోప తండాలుగా తరలి వస్తున్నారని చెప్పారు. రేపు జరగనున్న ఎన్నికలలో వైయస్ జగన్ సీఎంగా మరో సారి ఎన్నిక కావడం పక్కా అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ధీమా వ్యక్తం చేశారు. ఇక, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. అనగారిన కులాలకు గుర్తింపు సీఎం జగన్ ఇచ్చారు.. క్యాబినెట్ లో 5 ఉపముఖ్యమంత్రులను చేసారు.. బీసీలంటే వెనుకబడిన కులం కాదంటూ అన్నింటా న్యాయం చేసారు.. గత ప్రభుత్వం కేంద్ర మంత్రులుగా అవకాశం వస్తే అశోక్ గజపతి రాజు, సృజనా చౌదరిలను నియమించారు.. నేడు అన్ని రంగాలలో జగన్ సామాజిక న్యాయం అందిస్తున్నారు అని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.