సోషల్‌ మీడియా యాక్టివిస్టులు విడుదల

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

ఏపీ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడతాం

సోషల్‌ మీడియా యాక్టివిస్టు కాలేషావలి

గుంటూరు:  సోషల్‌మీడియా యాక్టివిస్టులు కొద్దిసేపటి క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఈ నెల 3వ తేదీన 13 మందిని అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియా యాక్టివిస్టు కాలేషావలి మాట్లాడుతూ.. తమపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో చంద్రబాబు వైఫల్యాలను మాత్రమే ఎత్తి చూపామని చెప్పారు. పేపర్‌లో వచ్చిన కార్టూన్లు మాత్రమే సోషల్‌ మీడియాలో పెట్టామని తెలిపారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడతామని కాలేషావలి హెచ్చరించారు. 
 

Back to Top