సామాజిక సాధికారయాత్ర ఫేజ్ -2

 తాడేప‌ల్లి: వైయస్ఆర్‌ సీపీ ప్రతిష్టాత్మక "సామాజిక సాధికార యాత్ర" రెండో దశ ప్రారంభం కాబోతుంది.. నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు సాగే ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొననున్నారు.
నా ఎస్సి,నా ఎస్టి,నా బిసి,నా మైనారిటీ నినాదంతో ప్రారంభమైన సామాజిక సాధికారయాత్ర సెకండ్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతోంది. నవంబర్ 15 నుంచి 30 వతేదీ వరకు జరగనుంది. తొలిదశలో 35 నియోజకవర్గాలలో జరిగిన సామాజిక సాధికారయాత్ర రెండోదశలో 39 నియోజకవర్గాలలో జరగబోతోంది.

  

రెండో దశలో తొలి రోజున (15-11-2023).... 
1.శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట 
2. గుంటూరు జిల్లా పొన్నూరు
3. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది. 

   పేద, బడుగు వర్గాలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించే సామాజిక సాధికార యాత్ర రెండో దశ 39 నియోజకవర్గాల్లో జైత్రయాత్ర చేయనుంది.

    వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగున్నరేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో పలు పధకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లింది. వైయస్ జగన్ పారదర్శక పాలనలో  వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఆర్థిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను.. చేసిన మంచిని వివరించే ఉద్దేశంతో అక్టోబర్ 26 వతేదీన చేపట్టిన సామాజిక సాధికార యాత్ర మొదటి దశ పూర్తిస్దాయిలో విజయవంతమైంది. ఆయా జిల్లాల్లో సామాజిక సాధికారయాత్రకు ప్రజలు స్వఛ్చంధంగా తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లోని 35 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా పూర్తి అయ్యింది.

   మన ప్రభుత్వంలో మనందరి అభివృద్ధి లక్ష్యంతో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్న మాటలకు నిజమైన అర్థం చెప్పి.. నాలుగున్నరేళ్ల పాలనలో అవినీతికి, వివక్షతలకు తావు లేకుండా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా సాగిన ప్రజా పాలనకు సామాజిక సాధికార యాత్ర అద్ధం పట్టింది.

      నాలుగున్నరేళ్లలో రూ. 2.35 (డీబీటీ) లక్షల కోట్ల సంక్షేమ పధకాల రూపంలో లబ్ధి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు వెళ్లింది. రూ. 2.34 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలోను మొత్తంగా రూ. 4.69 లక్షల కోట్లను వివిధ రూపాల్లో  పేదల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం అందించించడం జరిగింది. చారిత్రాత్మక పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి ప్రామాణికంగా నిలిచే జీఎస్డీపీ వద్ధి రేటులో నెంబర్ 1 గా నిలిచి, రాష్ర్ట ప్రజల తలసరి ఆదాయ వృద్ధిలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా 17వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరింది. ఇలాంటి రాష్ర్టం అభివృధ్దిపధంలోకి తీసుకువెళ్లిన అంశాలను సామాజిక సాధికార యాత్ర ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ నాలుగున్నరేళ్ల అభివృద్ధి పయనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన లబ్ధిని,ప్రయోజనాలను  ప్రస్పుటంగా తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నఈ యాత్ర రేపటి  (15-11-2023) నుంచి  రెండో దశలోకి అడుగిడుతోంది.

అక్టోబర్ 26 వతేదీన ప్రారంభమైన "సామాజిక సాధికార యాత్ర" మొదటి దశలో పూర్తి అయిన నియోజకవర్గాలు

1. శ్రీకాకుళం జిల్లా - ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస

2. గుంటూరు జిల్లా - తెనాలి, గుంటూరు ఈస్ట్

3. అనంతపురం జిల్లా - సింగనమల

4. విజయనగరం జిల్లా - గజపతినగరం, శృంగగవరపు కోట

5. పశ్చిమ గోదావరి జిల్లా -  నరసాపురం, పాలకొల్లు

6. తిరుపతి జిల్లా -  తిరుపతి

7. విశాఖపట్టణం జిల్లా - భీమిలి, గాజువాక

8. బాపట్ల జిల్లా - బాపట్ల

9. వైఎస్సార్ కడప జిల్లా -  ప్రొద్దుటూరు

10. ఆల్లూరి సీతారామ రాజు జిల్లా - పాడేరు

11. ఏలూరు జిల్లా - దెందులూరు

12. నెల్లూరు జిల్లా - ఉదయగిరి, కావలి

13. అనకాపల్లి జిల్లా - మాడుగుల, అనకాపల్లి

14. కృష్ణా జిల్లా - అవనిగడ్డ, పామర్రు

15. చిత్తూరు జిల్లా - చిత్తూరు

16. పల్నాడు జిల్లా - మాచెర్ల, వినుకొండ, పెదకూరపాడు

*17. శ్రీ సత్య సాయి జిల్లా - ధర్మవరం

18. కాకినాడ జిల్లా - కాకినాడ రూరల్

20. ప్రకాశం జిల్లా - మార్కాపురం, కనిగిరి

21. నంద్యాల జిల్లా - ఆళ్లగడ్డ

22. మన్యం జిల్లా - సాలూరు, పార్వతీపురం

23. అన్నమయ్య జిల్లా - తంబళ్లపల్లె

Back to Top