కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘ఎస్‌ఐఆర్’ (Special Intensive Revision) పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సులో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), ప్రజాప్రతినిధులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, మారిన వివరాల అప్‌డేట్ వంటి అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కాకినాడ జిల్లా టాస్క్ ఫోర్స్ హెడ్ బీవీ చౌదరి, తుని నియోజకవర్గ పరిశీలకుడు & టాస్క్ ఫోర్స్ సభ్యుడు వాసిరెడ్డి జగన్నాథం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సుకు ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్‌సీపీ బీఎల్‌ఏలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.