ఉచిత అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రారంభం

 శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు

 శ్రీ‌శైలం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త  శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న‌ సొంత నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ వాహనాన్ని మంగ‌ళ‌వారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ను  ఏజెన్సీ ప్రాంతాల నుంచి  ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించేందుకు వీలుగా దీన్ని అందుబాటులో ఉంచుతామని చ‌క్ర‌పాణిరెడ్డి పేర్కొన్నారు.

గతంలో శ్రీశైలం, సున్నిపెంటలో మెరుగైన వైద్య సేవలు అందక అత్యవసర వైద్యం కోసం పక్కన ఉన్న ప్రాంతలకు వెళ్లే వారు వారికి ఆ ఏజేన్సీ ప్రాంతంలో ఆంబులెన్స్ అందుబాటు ఉండటం చాలా తక్కువ. ఇలా చాలా మంది సరైన సమయంలో వైద్యం అందక చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి చూసి శిల్పా చక్రపాణి రెడ్డి  ఆంబులెన్స్  ఏర్పాటు చేశారు. చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల‌ కన్న ప్రజాసేవే ముఖ్యమని ప్రజలకు సేవచేయడనికి రాజకీయాల్లోకి వ‌చ్చామ‌ని చెప్పారు.  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగనే సున్నిపెంట‌లోనే అత్యాధునిక వైద్యం లభించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులని తయారుచేస్తామని చెప్పారు. అంబులెన్స్ ఏర్పాటు ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Back to Top