బాబాయ్ అచ్చెన్నాయుడి అక్ర‌మాలు ఎంపి.రామ్మాహ‌న్‌కి కూడా తెలుసు 

ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల‌రాజు 
 

శ్రీకాకుళం : అచ్చెన్నాయుడుకి ఈఎస్‌ఐ స్కాంకి సంబంధం లేద‌ని టీడీపీ నేత‌లు ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నార‌ని ఎమ్మెల్యే సీదిరి అప్ప‌ల‌రాజు ప్ర‌శ్నించారు. బాబాయ్ అచ్చెన్నాయుడి అక్ర‌మాలు ఎంపి.రామ్మాహ‌న్‌కి కూడా తెలుస‌ని చెప్పారు. 35 లక్ష‌ల‌మంది కార్మిక కుటుంబాల డ‌బ్బును అక్ర‌మంగా త‌ర‌లించార‌ని మండిప‌డ్డారు.  గురువారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. టీడీపీ నేత‌ల అక్ర‌మాలు, అవినీతి ఎవ‌రూ అడ‌గ‌కూడ‌ద‌న్న‌ట్లు లోకేష్ మాట్లాడ‌టం హ‌స్యాస్ప‌దం అన్నారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై మొట్ట‌మొద‌టిసారి స్పందించింది సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని గుర్తుచేశారు. ఆయ‌న‌కు మెరుగైన  వైద్యం అందించాల్సిందిగా సీఎం ఆదేశించిన‌ట్లు తెలిపారు. ఈఎస్‌ఐ కుంభకోణం కేసుల అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వైద్య బృందం నివేదిక ప్ర‌కార‌మే అచ్చెన్నాయుడు ని జైలు కి త‌ర‌లించారని అప్ప‌ల‌రాజు పేర్కొన్నారు.   

తాజా ఫోటోలు

Back to Top