శ్రీకాళహస్తిలో టీడీపీకి షాక్‌

వైయ‌స్ఆర్‌సీపీలోకి వంద కుటుంబాలు

చిత్తూరు: శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబు తీరును నిర‌సిస్తూ ఎన్నో ఏళ్లుగా పార్టీకి అండగా ఉన్న వంద కుటుంబాలు ఆ పార్టీని వీడాయి. ఏర్పేడు మండలం పల్లంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో 100 కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే బియ్యం మ‌ధుసూద‌న్‌రెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన టీడీపీ నేత‌లు మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో కుల‌,మ‌తాల‌కు అతీతంగా, పార్టీలు, ప్రాంతాలు చూడ‌కుండా అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నార‌ని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఓర్వ‌లేక టీడీపీ వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచిన వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకోవ‌డంలో తాము కూడా భాగ‌స్వాములం అవుతామ‌ని చెప్పారు.

Back to Top