నెల్లూరు రూరల్‌లో టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు షాక్

 50 మంది టీడీపీ, జన‌సేన‌ కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

 పార్టీ కండువా కప్పి వైయ‌స్ఆర్‌సీపీలోకి ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల

నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు.  గురువారం 31వ డివిజన్లోని టైలర్స్ కాలనీ చెందిన 50 మంది టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి నెల్లూరు రూరల్ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. 31 వ డివిజన్ ఇన్చార్జిలు చెన్నారెడ్డి నవీన్ కుమార్, అయిరెడ్డి, టీవీయస్ కమల్, బోయిల్ల ఆదిరెడ్డి, నాయకులు వీరపరెడ్డి నారాయణరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టైలర్స్ కాలనీకి చెందిన ఖాజా, మున్నా, నాయబ్, పండు తదితరుల తోపాటు వారి మిత్రబృందం స్వచ్ఛందంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయ‌కులు  సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై స్వచ్ఛందంగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన ప్రతి ఒక్కరికి అన్నివిధాల అండగా ఉంటానని రూరల్ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు అక్కి చంద్ర రెడ్డి, ఆ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top