సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు భేటీ

దావోస్‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు దావోస్‌లో భేటీ అయ్యారు. కాయిన్ స్విచ్‌ క్యూబర్‌ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ ఆశిష్‌ సింఘాల్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అదే విధంగా వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్‌, కొర్‌సెరా వైస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ మిల్స్‌, ఈజీమై ట్రిప్‌ సహ వ్యవస్థాసకుడు ప్ర‌శాంత్ పిట్టి, మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్‌ ఆత్రేయ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెట్టుబ‌డుల అవ‌కాశాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి అంద‌జేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top