సీనియర్‌ పాత్రికేయుడు శ్రీరంగనాథ్‌ మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సంతాపం

తాడేప‌ల్లి: కోనసీమకు చెందిన సీనియర్‌ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (78) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.  ఆయ‌న‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీరంగనాథ్‌ మృతి పత్రికా లోకానికి తీరని లోటని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జీవితాంతం బలమైన వామపక్ష రాజకీయ దృక్పథాన్ని ఆచరిస్తూ.. నీటిపారుదల రంగంలో డెల్టా వ్యవస్థ మెరుగుదలపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారని కొనియాడారు.
 

తాజా వీడియోలు

Back to Top