అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్యసురక్ష రెండో విడత కార్యక్రమం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం, కే.పూలకుంట గ్రామ సచివాలయం పరిధిలో ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మునుపెన్నడు ఇవ్వనంత ప్రాధాన్యత పేదవారి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత సెప్టెంబర్ నెలలో మొదటి విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించగలిగామన్నారు. అంతే స్థాయిలో వివిధ రకాలైన స్పెషలిస్టుల ద్వారా పేదవారికి వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. పేదవారి వైద్యానికి ప్రభుత్వమే భరోసా ఇస్తున్నదన్నారు. యావత్ దేశంలో ఎక్కడ కూడా పేదవారి వైద్యం పట్ల ఇటువంటి వెసులుబాటు ఎక్కడా కల్పించలేదని, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఈవిధమైన విధానం అమలుపరుస్తున్నారాన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.