రెండో బెస్ట్ సీఎంగా వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి 

కరోనా యాక్షన్ ప్లాన్‌పై ఒర్మాక్స్ మీడియా సర్వే

 అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో ఘ‌న‌త సాధించారు. క‌రోనా క‌ట్ట‌డిలో దేశంలోనే అత్యుత్త‌మ ముఖ్య‌మంత్రుల జాబితాలో వైయ‌స్ జ‌గ‌న్ రెండో స్థానంలో నిలిచి ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా మారారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే విషయంపై ఒర్మాక్స్ మీడియా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం- ఏప్రిల్‌లో మాత్రమే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి, పరిపాలనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక, దాని అమలు తీరును ఆధారంగా చేసుకుంది. అనంతరం అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాను రూపొందించింది. దాన్ని ప్రజామోదం కోసం విడుదల చేసింది. 

ఈ జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 55 పాయింట్లను ఇచ్చింది ఒర్మాక్స్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. అస్సాం, కేరళ ముఖ్యమంత్రులు శర్బానంద సొనొవాల్, పినరయి విజయన్ సంయుక్తంగా మూడో స్థానాన్ని చేజక్కించుకున్నారు. వారిద్దరికీ 54 చొప్పున పాయింట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. యోగి ఆదిత్యనాథ్-53, మమతా బెనర్జీ-52 పాయింట్లను సాధించారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు 15 స్థానంలో నిలిచారు. కేసీఆర్‌ పనితీరుకు ఒర్మాక్స మీడియా సంస్థ ఇచ్చిన పాయింట్లు 46. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పది 17వ స్థానం. 37 పాయింట్లు యడియూరప్పకు దక్కాయి. ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిలిచిన‌ట్లు తమ సర్వేలో తేలినట్లు ఒర్మాక్స్ పేర్కొంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top