సాలూరులో  సామాజిక సాధికార యాత్రకు ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీల అఖండ స్వాగతం 

జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రిక కర్తవ్యం- స్పీకర్ తమ్మినేని

ఎవరు మేలు చేస్తున్నారో... మంచి చేస్తున్నారో  ప్రజలు ఆలోచించాలి - డిప్యూటీ సీఎం రాజన్నదొర

చంద్రబాబు స్కా మ్ లతో తమ ఖాతాలో డబ్బు వేసుకంటే, జగన్ ప్రజల ఖాతాల్లో పథకాల సొమ్ము వేస్తున్నారు - ధర్మాన

 

 సామాజిక సాధికార బస్సు యాత్రకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అఖండ స్వాగతం లభించింది.  నియోజకవర్గానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు,పార్టీనేతలకు అడగుడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. ఈ సందర్భంగా  వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైయస్సార్ సిపి ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు అప్పలనర్సయ్య, పుష్పశ్రీవాణి లు కలసి పరిశీలించారు. సాలూరు కూడలిలో జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన జనంతో పట్టణం నలు వీధులు కిక్కిరిసిపోయాయి.

   స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, దశాబ్ధాల కాలంగా వెనుకబడిన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని పారద్రోలి వారికి ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని జగన్ కల్పించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు నిలబడి ఏ మాట ఇస్తానో అది నిలబెట్టుకుంటానని జగన్ పాదయాత్ర సమయంలోనే చెప్పి , ఆధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీత తరహాలో భావించి అమలు చేసి చూపారని వివరించారు.  ఎస్టీ, ఎస్సీ, బీసీలకు,మైనారిటీలకు రాజ్యాధికారం ఇవ్వాలని సంకల్పించి పాలనలో ఆయా వర్గాలకు ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. అంబేద్కర్ వారసుడుగా, బాపూజీ ఆశయ సాధకుడుగా  జగన్ పరిపాలన చేస్తున్నారని సీతారామ్ వెల్లడించారు. నాయీ బ్రహ్మణులను, మత్స్యకారులను చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు బెదిరించి అవమానించగా, ఎన్నికల్లో ఆయనకు వారు తగిన గుణపాఠం చెప్పారన్నారు. బిల్డింగ్ లు కట్టడం, రోడ్లు వేయడం  మాత్రమే అబివృద్ధా.. అని ప్రశ్నించారు. బాలలు నిరక్షరాస్యులుగా ఉండిపోకుండా, నిరుపేదల వైద్యం చేయించుకోలేక చావుబ్రతుకుల్లో ఉన్నవారికి సకాలంలో వైద్యం అందించడం అభివృద్ధా అన్నది చంద్రబాబు చెప్పాలని సీతారామ్ డిమాండ్ చేసారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం చారిత్రిక కర్తవ్యమని తమ్మినేని పిలుపునిచ్చారు.  జగన్ జనంతో ఏనాడో పొత్తు కుదుర్చుకున్నారని, బాబు మాత్రం పవన్ తో పొత్తు కుదుర్చుకుని వస్తున్నారని, ఎవరెవరు, ఎంతమంది వచ్చిన మళ్లీ జగన్ దే అధికారమని తమ్మినేని ఉద్ఘాటించారు. 

 

ఎవరు మేలు చేస్తున్నారో.. మంచి చేస్తున్నారో  ప్రజలు ఆలోచించాలి - డిప్యూటీ సీఎం రాజన్నదొర.

       బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ  మంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ  సాలూరులో  సుమారు 8 లక్షల మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందచేసామని గుర్తు చేసారు.  రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా  చంద్రబాబు చేసినా,సాలూరులో ఎక్కువ కాలం టీడీపీ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహించినా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారన్నారు. గిరిజనులకు రెండుసార్లు ఉప ముఖ్యమంత్రి పదవిని జగన్ కట్టబెట్టగా, చంద్రబాబు కేబినెట్ లో అసలు గిరిజనులకు ప్రాతనిధ్యం లేకుండా చేసారని మండిపడ్డారు.  ఎస్టీలకు  గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు జగన్ రాజకీయ అధికారం కల్పించారని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో జగన్ కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని రాజన్నదొర కోరారు. బాబు ఇచ్చిన హామీల్లో వేటినీ నెరవేర్చలేదని, చివరకు గిరిజనులకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేక మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఎవరు మేలు చేస్తున్నారు... ఎవరు మంచి చేస్తున్నారు. ఎవరు సంక్షేమం కోసం పాటుపడుతున్నారో  ప్రజలు గుర్తించాలన్నారు. ఎస్టీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని, బీసీలకు తోకలు కత్తిరిస్తానని అవమానించిన చంద్రబాబును ఎక్కడో, వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవం నిలిపిన జగన్  స్థాయి ఎక్కడో ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. అన్ని  వర్గాలను మోసం చేసిన టీడీపీ, జనసేన వంటి పార్టీలను ప్రజలు నమ్మితే గతంలో వలె మరోసారి మోస పోతారని హెచ్చరించారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని, ఆయనకు తోడుగా, అండగా ఉండాలని రాజన్నదొర కోరారు. 

చంద్రబాబు స్కా మ్ లతో తన ఖాతాలో డబ్బు వేసుకంటే, జగన్ ప్రజల ఖాతాల్లో పథకాల సొమ్ము వేస్తున్నారు - ధర్మాన

రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ,  ఎన్నికల్లో ఓటు వేసినా, వేయకపోయినా, రేపటి ఎన్నికల్లో కూడా వేయకూడదనుకున్న టీడీపీ వాళ్లకు సైతం   సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాస్వామ్యం ఫరిడవిల్లేలా జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాం వలె జెండా కట్టలేదనో, ఓటు వేయరనో రోడ్లు వేయం అనే దుస్థితి  లేదని వివరించారు. ఎవరికి సలామ్ చేయకుండా, ఎక్కడా లంచాలు ఇవ్వకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు జమ చేస్తూ సంక్షేమం అమలు చేస్తున్నారని, ఈ ప్రభుత్వం ఉంటే చాలు తాము సంతోషంగా ఉంటామనే ధీమా అన్ని వర్గాల్లో వచ్చిందని ధర్మాన ప్రసాదరావు వివరించారు. 12,800 కోట్ల భూమి కొని ఇళ్ల స్థలాలు జగన్ కేటాయిస్తుండటం ఓ చారిత్రక ఆధ్యాయమని అభివర్ణించారు. గతంలో పరిపాలించిన పాలకులు పేదలకు గూడు కల్పించలేదని ఆ  పార్టీల నేతలు ఇప్పుడు ఏం సమాధానం  చెప్తారని ప్రశ్నించారు. సంక్షేమం అమలు చేస్తుంటే పేదల డబ్బు దుర్వినియోగం  చేస్తున్నారని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, పథకాల వల్లనే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని వివరించారు.  ఒక్క అవకాశం ఇస్తేనే ప్రజల జీవన పరిస్థితుల్లో జగన్ మార్పులు తెచ్చారని, ముూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేసినపుడు ఏమీ చేయకపోగా, మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతుండటం వంచన కాదా అని ధర్మాన నిలదీసారు. ఏ పథకం చెడ్డదో.. ఏ పథకం ఏత్తివేయాలనుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు. పేదల చదవుకు పేదరికం అడ్డురాకూడదని నాడు-నేడు ద్వారా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు  జగన్ తెచ్చారని వెల్లడించారు. ప్రజలకు చెందిన డబ్బు చంద్రబాబు స్కిల్ డవలప్ మెంట్ పేరుతో స్కామ్ కు పాల్పడి తమ ఖాతాలోకి వేసుకున్నారని,  జగన్ మాత్రం సంక్షేమం కోసం మీ ఖాతాల్లో సొమ్ము  డిపాజిట్ చేస్తున్నారని వివరించారు. 

 

       అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ, ఏ సామాజిక వర్గానికి అన్యాయం చేయకుండా అందరికీ సముచిత స్థానం కల్పిస్తూ  జగన్ పరిపాలన సాగిస్తున్నారని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాలైన పాడేరు, పార్వతీపురం లలో  మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న ఘనత సీఎం జగన్ దే నని గుర్తు చేసారు. మీ కుటుంబానికి సీఎం జగన్ ద్వారా  మేలు జరిగిందని భావిస్తే సాలూరులో మరోసారి  వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

Back to Top