ఏపీ ప్ర‌భుత్వానికి గోల్డ్ అవార్డు అంద‌జేసిన స్కోచ్ సంస్థ‌

అధికారుల‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడంతో పాటు ఆ రుణాలను సద్వినియోగం చేసుకుని, సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్‌ సంస్ధ గోల్డ్‌ అవార్డు అందజేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధకు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీ నిధి సంస్ధ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొదుపు సంఘాల మహిళలకు సులభ విధానంలో రుణాలు అందజేస్తున్నందుకు స్త్రీ నిధి సంస్థ స్కోచ్‌ అవార్డు దక్కించుకుంది. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌కు అధికారులు అవార్డులు చూపించారు. అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అభినంచారు.

Back to Top