విశాఖపట్నం జిల్లా: విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బోగి మంటలు, ముగ్గులు, గంగిరెద్దులతో వేడుకను నిర్వహించారు. విద్యార్థినులు మెహందీ, రంగోళి, గాలిపటాల పోటీలు, ఉట్టికొట్టడం, బోగిమంటలు వేశారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు.