తాడేపల్లి: వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు పెద్ద పీట వేశారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. బీసీల అభ్యునతికి సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం జగన్ అధ్యయన కమిటీ వేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీఠ వేసింది. క్యాబినెట్‌లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేశారు. బీసీల కోసం 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీలకు నేడు పండుగ రోజు. అందులో భాగంగా 30వేల జనాభా మించిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్ , డైరెక్టర్లను నియమిస్తారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పారు. బీసీలంతా వైయస్ జగన్ వెంట ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శంకర నారాయణ తెలిపారు. బీసీలంటే బిజినెస్ క్యాస్ట్‌గా టీడీపీ చూసింది - ధర్మాన 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అయితే వైఎస్ జగన్ తన పాదయత్రలో బీసీల బాధలు తెలుసుకొని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాటప్రకారం బీసీల కోసం 28 కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ బీసీలను బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్ క్యాస్ట్‌గా చూసింది. అందుకే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ధర్మాన పేర్కొన్నారు. (బీసీ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష) బలహీన వర్గాల ప్రజలకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డే బలం: జంగా చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో బీసీల కష్టాలు చూశారు. 30వేల జనాభా దాటిన ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీనిచ్చారు. సీఎం అయిన వేంటనే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారు. మాటలు కాకుండా చెప్పిన ప్రతి హామీని సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమానికి 43వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ. 22వేల కోట్లు బీసీలకు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. ప్రతి కులం రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని చెప్పే వ్యక్తి జగన్ అని జంగా కృష్ణమూర్తి అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసింది. బలహీన వర్గాల ప్రజలకు జగన్‌మోహన్ రెడ్డే బలమని అన్నారు.