చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిన సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: రాజన్న బడి బాట కార్యక్రమంలో భాగంగా మూడో రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఒకేసారి 2 వేల మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. వైయస్‌ జగన్‌ తన ఒడిలో చిన్నారులను కూర్చోబెట్టి అక్షరాలు దిద్దించారు. అనంతరం వారిని ఆశీర్వదించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top