కాకినాడ: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాకారమైందని నేతలు కొనియాడారు. మహనీయుల ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ర్ట మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, ఎంపీలు వంగా గీత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అనిల్ కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బస్సుయాత్రలో నేతలు ఏమన్నారంటే.. బూడి ముత్యాలనాయుడు, ఉపముఖ్యమంత్రి. – స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగనన్న పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైంది. – బీసీ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వేదిక మీదకు వచ్చి మాట్లాడుతున్నానంటే జగనన్న ఆలోచన విధానం వల్లే సాధ్యమైంది. – రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలో అందరూ ఆలోచన చేయాలి. – సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్నారు. – అప్పటి వరకు ఉన్న పింఛన్ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. – అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికే మూడు విడతలు ఇచ్చారు. – అక్కచెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని బాబు మోసం చేశాడు. కానీ జగనన్న నాలుగు విడతలుగా చెల్లిస్తున్నారు. – రైతుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, రైతు భరోసా ఇస్తున్న సీఎం జగనన్న. – ఇంగ్లీషు మీడియం తెచ్చి ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు మించి అభివృద్ధి చేస్తున్నారు. – ఈ పథకాలు జగనన్న సీఎంగా ఉంటేనే కొనసాగుతాయి. తానేటి వనిత, హోంమంత్రి. – కేబినెట్‌లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు 17 మంది ఉన్నాం. – ఏ కార్పొరేషన్, మేయర్, మున్సిపల్ చైర్మన్ చూసినా అందరికీ అవకాశాలు మెండుగా ఇచ్చారు. – అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి, జ్యోతిరావుపూలే ఆలోచనలు, జగ్జీవన్ రామ్ పాలనాదక్షత వల్ల జగనన్న సామాజిక న్యాయం చేయగలిగారు. – దళిత మహిళగా హోంమంత్రిగా మీ ముందు నిలబడి ఉన్నానంటే రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నా. – జగనన్నకు ముందు, జగనన్నకు తర్వాత అని మాట్లాడేలా సామాజిక న్యాయం పాటించి మనందర్నీ గౌరవించి, స్థానం కల్పించిన జగనన్న. – దళితుల పక్షాన జగనన్న నిలబడి ధైర్యాన్ని ఇచ్చారు. బలహీనుల పక్షాన నిలబడి వారికి బలమయ్యారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా ధైర్యాన్నిఇవ్వలేదు. పినిపె విశ్వరూప్, మంత్రి. – బాబు హయాంలో పేపర్లకే పరిమితమైన సామాజిక సాధికారత.. జగనన్న పాలనలో చేతల్లో చూపారు. – రాజ్యాధికారంలో ఎవరి వాటా వారికిచ్చి సామాజిక న్యాయం చేశారు. – బాబు పాలనలో ఎస్టీలకు, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు. – ఎస్సీలు, బీసీలకు, ముస్లింలకు, కాపులకు, ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవులిచ్చిన సీఎం జగన్. – సామాజిక సాధికారతకు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ జగనన్న. – బాబు హయాంలో 30 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, నేడు 64 లక్షల మందికి జగనన్న ఇస్తున్నారు. – కేవలం ఎన్నికల కోసమే 650 వాగ్దానాలు ఇచ్చిన తుంగలో తొక్కిన చంద్రబాబు. – 2024లో జగనన్న తిరిగి సీఎం కాకపోతే చదువుల యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చదువులు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలి. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి. – చంద్రబాబు వల్ల మోసపోయిన సామాజిక వర్గాలు ఇప్పుడు పురివిప్పుతున్నాయి. – చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల అప్పులు తీరుస్తానని మోసం చేశాడు. – చంద్రబాబుకు కేవలం ఆయన కులం మాత్రమే కనపడుతుంది. కానీ జగనన్నకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కనపడతారు. – అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే దాని ఫలాలు ప్రజలకు అందిస్తున్నవ్యక్తి జగనన్న. – చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, పవన్ కల్యాణ్‌ను కలుపుకొని పోతున్నాడు. – ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు జగనన్న వద్ద ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ, ఎంపీ. – అమ్మ ఒడి కావాలని, చేయూత, సున్నావడ్డీ కావాలని ఎవరూ అడగలేదు. – పేదలకు ఆర్థిక చేయూతనివ్వాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేరుగా రూ.2.40 లక్షల కోట్లిచ్చారు జగనన్న. – చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు ఏ ప్రాజెక్టు పెట్టినా రూ.లక్షల కోట్లు కమీషన్లు దండుకోవాలని చూశాడు. పేద ప్రజల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచన చేయలేదు. – రాజ్యసభలో నలుగురు బీసీలకు అవకాశం కల్పించారు జగనన్న. – బీసీలను రాజకీయంగా అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టారు జగనన్న. కన్నబాబు, ఎమ్మెల్యే. – చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమం చేస్తున్న జగనన్న. చెప్పాడంటే చేస్తాడంతే అని పేరు తెచ్చుకున్నారు. – నేను పేదల పక్షం, నా యుద్ధం పెత్తందార్లతో అని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. – కాకినాడ రూరల్ పరిధిలో రూ.800 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో వేశారు. – లక్షమందికి పైగా లబ్ధిదారులున్నారు. వీరిలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. – సరిగ్గా ఆరేళ్ల కిందట జగన్ గారు పాదయాత్ర ఈరోజే ప్రారంభించారు. – చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి వెళ్తూ నాకు దృష్టిలోపం ఉంది, ఆపరేషన్ చేయించుకొని వస్తానన్నాడు. – పేదలు ఆయనకు కనబడరు. సొంత కులస్తులు, పెత్తందార్లు మాత్రమే ఆయనకు కనపడతారు. ఈ విషయం జనం ఎప్పుడో గమనించారు. అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే. – బీసీలకు అత్యధికంగా పదవులిచ్చిన జగనన్న. మార్కెట్ యార్డు చైర్మన్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలున్నారు. – నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పగలిగే సీఎం జగనన్న మాత్రమే. – అయ్యప్పమాల వేసుకొని చెబుతున్నా. ఆ నాయకుడి కింద పని చేయడం ఏ జన్మలో పుణ్యమో. – పక్కనోడు సీఎం అవ్వాలని పార్టీ పెట్టే వ్యక్తి మనకు అవసరమా? – ఇక్కడేమో టీడీపీతో అంటాడు, తెలంగాణలో బీజేపీతో పొత్తు. టీడీపీకి అక్కడేమో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం. – మళ్లీ మనం వెనక్కి పోదామా ముందుకు పోదామా అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఆలోచన చేయాలి.