మచిలీపట్నం: వెనుకబడిన వర్గాల జై జగన్ నినాదాలతో మచిలీపట్నం మార్మోగింది. మచిలీపట్నంలో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. వేలాది మంది జనసందోహం మధ్య బలహీనవర్గాల నేతలకు ఆత్మీయ స్వాగతం లభించింది. సామాజిక సాధికార యాత్రతో బందరు రోడ్లన్నీ కిక్కిరిశాయి. జగనన్న అండతో తాము సాధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారతను బడుగువర్గాల నేతలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్‌కుమార్, అనిల్ కుమార్ యాదవ్, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... – ఇంతకాలంగా అభివృధ్దికి నోచుకోని కుటుంబాలు మన ప్రభుత్వంలో హాయిగా జీవించేలా భవిష్యత్‌పై ఆశలు కల్పించిన సీఎం జగన్. – అన్ని వర్గాలకూ అధికారం కట్టబెట్టడం మొదలు పెట్టిన సీఎం జగన్. – గత ప్రభుత్వంలో ముస్లింలకు, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వలేదు. వాళ్లు మనుషులు కాదా? – కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ఇంటి ఇల్లాలిదే అని భావించిన సీఎం జగన్. అన్ని సంక్షేమ కార్యక్రమాలకూ ఇంటి ఇల్లాలినే యజమానిగా చేశారు. – పేదల ఆకలి తీర్చి, కన్నీరు తుడిస్తే చంద్రబాబు ఈ డబ్బంతా వృథా అంటున్నాడు. – వీరిని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు సీఎం జగన్ మనకు దొరికాడు. ఎవరిని ఆదరిస్తాం? ఆలోచించాలి. – ప్రతిసారీ అబద్ధం ఆడి బీదలకు సాయమే తప్పు అన్న వ్యక్తిని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామా? – రూ.12,800 కోట్లు బడ్జెట్‌లో పెట్టి ప్రయివేటు రైతుల దగ్గర కొని 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చాం. ఇప్పుడు ఊళ్లకు ఊళ్లు నిర్మాణం జరుగుతున్నాయి. – చంద్రబాబు పాలనలో పట్టుమని 5 లక్షల ఇళ్లకు ఏనాడైనా భూమి కొన్నాడా? – సీఎం జగన్ అన్ని స్కూళ్లూ బాగు చేయించాడు. ఉపాధ్యాయులను నియమించాడు. కంప్యూటర్, పుస్తకాలు, బట్టలు ఇచ్చి మంచి తిండి పెట్టాడు. – తల్లికి అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు ఇచ్చాడు. పది సంవత్సరాల పిల్లాడు ఓటేస్తాడని జగన్ ఇవన్నీ చేశాడా? – పిల్లాడు పెరిగి పెద్ద అయ్యి చదివి ఉన్నత స్థాయికి చేరితే ఆ కుటుంబం స్థాయి పెరుగుతుందని సీఎం జగన్ ఇదంతా చేస్తున్నారు. – రూ.2.40 లక్షల కోట్లు మీ ఖాతాల్లో వేసిన సీఎం జగన్. ఎక్కడా ఒక్కరూపాయి లంచం ఇచ్చామనే కంప్లయింట్ రాలేదు. – ఈ డబ్బంతా వేస్్ట అని చంద్రబాబు అంటాడు. మళ్లీ తనకు ఓటేయమంటాడు. – గతంలో ఊరికి ఐదు మంది చొప్పున లంచం తీసుకొనేవాళ్లను పెట్టారు. – ఇప్పుడు కులం, మతం, వర్గం అడగలేదు. ఆకలి తీర్చాల్సిన, కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సీఎం జగన్ చెప్పారు. – ఏ గ్రామంలోనూ వైయస్సార్‌సీపీకి వ్యతిరేకత లేదు. దీంతో నూనె, కరెంటు, గ్యాస్, పెట్రోలు, డీజిలు, కిరోసిన్ ధరలు పెరిగాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. – ఈ ధరలు దేశమంతా ఒకేలా ఉన్నాయి. ఒకేలా పెరిగాయి. పెంచింది కేంద్రం. – ఇతర విషయాల్లో ఈ ప్రభుత్వాన్ని విమర్శించలేరు కాబట్టి టీడీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారు. – పథకాలు అందుకోవడంలో బీదవాడు గౌరవంగా, దర్జాగా జీవించే పరిస్థితి తెచ్చాం. – చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీఎస్‌డీపీ 16వ ర్యాంకు ఉండేది. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. – గతంలో తలసరి ఆదాయంలో ఏపీ 17వ ర్యాంకు ఉంటే నేడు 9వ ర్యాంకుకు వచ్చాం. – నాడు అప్పుల గ్రోత్ రేటు 169 శాతం ఉంటే నేడు 58 శాతమే. – టీడీపీ హయాంలో అగ్రికల్చర్ గ్రోత్‌రేటు –6.5 ఉంటే నేడు +5.56 శాతం ఉంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... – బీసీలను గుండెల్లో పెట్టుకున్న జగనన్న. – మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి అన్ని పదవులలో 50 శాతానికిపైగా ఇచ్చారు. – బీసీలకు మంత్రిపదవులిస్తే ఆ పదవులను జీరోలుగా చెబుతున్న టీడీపీ నేతలు. సున్నాల పక్కన ఒకటి నుంచి కోటి దాకా విలువతెచ్చిన నాయకుడు జగనన్న. – ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసుకొని బతికేలా చేసిన జగనన్న. – వెయ్యి మందికో, 10 వేల మందికో ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న టీడీపీ. – వైయస్సార్ చేయూత ద్వారా రూ.18 వేలు చొప్పున ఏటా 50 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేలు చేస్తున్న జగనన్న. – నేను మీకు మంచి చేస్తేనే ఓటు వేయాలని చెప్పే దమ్మున్న నాయకుడు జగనన్న మాత్రమే. – మత్స్యకారులను తోలుతీస్తానని చంద్రబాబు అంటే, అదే సామాజిక వర్గాన్ని జగనన్న రాజ్యసభకు పంపారు. – మత్స్యకారులకు మేలు చేస్తూ 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న సీఎం జగనన్న. – విశాఖలో బోట్లు కాలిపోతే నాలుగు రోజుల్లోనే ఆదుకున్న సీఎం జగన్. – బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లోని మహిళలు మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు. – మంచి చేసిన జగనన్న 2024లో ఎన్నికలకు వస్తున్నాడు. ఒక్క అడుగు మనతో వేయించాడు. 2024లో మళ్లీ జగనన్నను గెలిపించుకుందాం. 10 అడుగులు ముందుకేద్దాం. – రాబోయే ఎన్నికలు బలిసిన వాడికి, బక్కచిక్కినోడికి మధ్య జరిగేవి. బలిసిన వాడి పక్కన చంద్రబాబు, బక్కచిక్కిన వాడి పక్కన జగనన్న ఉన్నాడు. – స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నెల్లూరు జిల్లాలో బీసీనైన నన్ను తొలిసారి మంత్రిగా చేసిన ఘనత జగనన్నది. – గొర్రెలు కాచుకొనేవాళ్లకు మంత్రి పదవిచ్చారని టీడీపీ వాళ్లు విమర్శించారు. శ్రీకృష్ణపరమాత్ముడు గొర్రెలు కాచినవాడే. ఏసు ప్రభువు గొడ్లు కాచుకొనే చావడిలో పుట్టాడు. – మాలాంటి వాళ్లు గొర్రెలు, బర్రెలు కాచుకొని పాలు పితికితేనే రూ.20 వేల కోట్లు భువనేశ్వరి కంపెనీకి వచ్చాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ... – మైనార్టీల బాగోగులు చంద్రబాబు చూసుకోలేదు. – వైయస్సార్ సీఎం అయిన తర్వాత ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు. – ఈరోజు మైనార్టీల పిల్లలు మచిలీపట్నం నుంచి ఆస్ట్రేలియా, దుబాయ్ దాకా వెళ్లి కోటీశ్వరులయ్యారు. అందుకు కారణం వైయస్సార్. – చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు మంత్రి కూడా ఇవ్వలేదు. – కానీ జగనన్న వచ్చిన తర్వాత నేడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పదవులిచ్చారు. – సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసే నాయకుడు మన జగనన్న. – పేదల పార్టీ, మనందరి పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షపాతి జగనన్న. – పథకాల కోసం ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, మున్సిపాల్టీ ఆఫీసులకు వెళ్లి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ఇస్తున్నారు. – మా పిల్లలకు స్కూల్లో యూనిఫాం, బ్యాగు, బుక్స్ , జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, కాలేజీకి వెళ్తే విద్యా దీవెన, వసతి దీవెన, ఆపై చదువులకు విదేశీ విద్యాదీవెన ద్వారా ఆదుకుంటున్నారు. – పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్యే అంటున్న జగనన్న. – ఆరోగ్యశ్రీ పరిధిలో 3 వేలకుపైగా చికిత్సలను యాడ్ చేశారు. – వైద్యం కోసం విజయవాడకు వెళ్లాల్సిన పని లేకుండా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ తెచ్చారు. టీడీపీ ఎందుకు చేయలేకపోయింది. – మహిళా సాధికారత వైయస్సార్‌సీపీ మాత్రమే చేయగలిగింది. – మనకు న్యాయం చేసే నాయకుడు జగనన్న. అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. – రూ.2.36 లక్షల కోట్లు రూపాయి లంచం లేకుండా నేరుగా ఇంటికే ఇచ్చిన జగనన్న. చంద్రబాబు మీకు ఇవ్వాల్సిన డబ్బులు తినేశాడు. – మైనార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన జగనన్న. – రూ.26 వేల కోట్లు ఒక్క మైనార్టీ సామాజిక వర్గానికే ఇచ్చిన ఘనత జగనన్నది. – ఇమామ్, మౌజమ్‌లకు సాయం చేస్తున్న ప్రభుత్వం మనది. – మచిలీపట్నానికి పోర్టు, ఫిషింగ్ హార్బర్‌తో ఈ ప్రాంతంలో ఉపాధి వచ్చింది.