వంగపండు'కు వందనం

ప్రజాకవి వంగపండు ప్రసాద రావు వర్ధంతి సందర్భంగా ఏటా జానపద పురస్కారం.

కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక చేయూత

అమ‌రావ‌తి: ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదుతూ... సిక్కోలు నక్సల్స్ బరి ఉద్యమాన్ని తన గీతాలతో ఉరకలెత్తించిన గాయకుడు..ఉద్యమ కారుడైన వంగ పండు ప్రసాదరావుకు ప్రభుత్వం అరుదైన నివాళి అర్పించింది.  విశేష జనాదరణ పొందిన 400 కు పైగా జానపద గీతాలు రాచించిన వంగపండు వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్యేక పురస్కారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ఏటా ఆగస్టు 4వ తేదీన "వంగపండు ప్రసాదరావు జానపద పురస్కార ప్రదాన కార్యక్రమం" నిర్వ హిస్తామంటూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పురస్కారం కింద ఏటా రూ.2 లక్షలు నగదు బహుమతి అందించ నున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  అదేవిధంగా జానపద కళాకారుడు వంగపండు కుటుంబానికి  రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

తాజా వీడియోలు

Back to Top