పాత, కొత్త కలయిక‌తో కేబినెట్‌ కూర్పు

బీసీలకు ప్రాధాన్యత, మహిళలకు సముచిత స్థానం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: పాత, కొత్త కలయికతో కేబినెట్‌ కూర్పు ఉంటుందని, కేబినెట్‌ కసరత్తు కొనసాగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. సుమారు 3గంటల పాటు సమావేశం సాగింది. భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం వరకు కేబినెట్‌ కూర్పుపై కసరత్తు జరుగుతుందని చెప్పారు. కాబోయే మంత్రులకు రేపు ఫోన్లు చేస్తారని, కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత, మహిళలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. అన్ని అంశాలను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలిస్తున్నారని చెప్పారు.
 

Back to Top