సామాజిక న్యాయం నినాదం కాదు..వైయస్‌ జగన్‌ నిజం చేశారు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

మంత్రి వర్గ కూర్పులో సామాజిక న్యాయం

కేబినెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట

కేబినెట్‌లో 70 శాతం మంది బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు..బ్యాక్‌బోన్‌ క్లాస్‌

చంద్రబాబు ఎప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండలేదు

తాడేపల్లి:  సామాజిక న్యాయం అన్నది నినాదం కాదని నిజం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు వైయస్‌ జగన్‌ పెద్ద పీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదన్నారు.వైయస్‌ఆర్‌సీపీలో మొదటి నుంచీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీటవేస్తుందని తెలిపారు. కొత్త కేబినెట్‌లో సీఎం వైయస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించారని చెప్పారు.మంత్రి వర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. పరిమితంగా ఉండే పదవుల్లో అత్యధిక సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 48 శాతమే బడుగు, బలహీన వర్గాలకు అవకాశం కల్పించారని, వైయస్‌ జగన్‌ తన కేబినెట్‌లో 70 శాతం ఈ వర్గాలే ఉన్నాయని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు పదవులు ఇస్తున్నారని తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే కేబినెట్‌ తుది జాబితా ఇచ్చారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించారని వివరించారు.మంత్రి వర్గ కూర్పుపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మంత్రి వర్గ కూర్పులో సీఎం వైయస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తు..రాజ్యాంగం ప్రకారం ఆ వర్గాలకు అవకాశం కల్పించారు, తరతరాలుగా పేదరికంలో ఉన్న వర్గాలను పైకితీసుకురావడమే లక్ష్యంగా వైయస్‌ఆర్‌సీపీ ఏర్పాటైనప్పటి నుంచి వైయస్‌ జగన్‌ మనసా,వాచ, కర్మన ఆచరిస్తున్నారు. వైయస్‌ జగన్‌ పార్టీ పెట్టింది మొదలు ఇదే విధానంతో ముందుకు వెళ్తున్నారు. 
పాదయాత్ర సమయంలో   అన్ని బీసీ కులాలతో సమావేశమై..వారి ఇబ్బందులపై అధ్యాయనం చేయించి, ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ సభ ఏర్పాటు చేసి బీసీలకు తాను చేసే మంచిని వివరించారు. 
బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు..బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా భావించి, నిబద్ధతతో సీఎం వైయస్‌ జగన్‌ చేస్తానని చెప్పి, 2019 తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరణలో పెట్టారు. 151 మంది ఎమ్మెల్యేలతో అత్యధిక మెజారిటీతో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 
గత క్యాబినెట్‌లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారు. 11 మంది ఓసీలకు క్యాబినెట్‌లో అవకాశం కల్పించారు. ఇదో విప్లవాత్మకమైన చర్య. ఇలా గతంలో ఎప్పుడు జరగలేదు. చంద్రబాబు క్యాబినెట్‌తో పోలిస్తే..ఇది చాలా గొప్పది. చంద్రబాబు చెప్పే విధంగా బీసీలకు ఏమీ చేయలేదు. తన హయాంలో మొదట 48 శాతం, తరువాత తన కేబినెట్‌లో 52 శాతం అవకాశం కల్పించారు. 

వైయస్‌ జగన్‌ రేపు ప్రమాణ శ్రీకారం చేయబోయే మంత్రుల జాబితాను పరిశీలిస్తే బీసీలకు 10, ఎస్టీ 1, మైనారిటీలు1, ఎస్సీలు 5 స్థానాలు కేటాయించారు. చంద్రబాబు బీసీలకు ఆత్మబంధువు అని చెబుతుంటారు. ఆయన కేబినెట్‌లో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. వైయస్‌ జగన్‌ కొత్త కేబినెట్‌లో దాదాపు 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించారు. అన్ని రంగాల్లో ఈ వర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ప్రాధాన్యత కల్పించారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటను కేబినెట్‌ కూర్పులో నెరవేర్చారు.
2014లో 19 మందితో చంద్రబాబు కేబినెట్‌ నడిపారు. ఆయన కేబినెట్‌లో తన కుమారుడిని తీసుకున్నారే కానీ, ఎమ్మెల్యేగా పోటీలో నిలుపలేదు. ఆయన కొడుకు కోసం మరో ఐదు మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. 10 మంది మాత్రమే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. 2018 నవంబర్‌లో బీజేపీలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తే..అప్పుడు ఒక మైనారిటీకి అవకాశం కల్పించారు. చంద్రబాబు అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు. 
రాజకీయ సాధికారత దిశగా వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. గతంలో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తే..ఇప్పుడు 68 శాతానికి పెంచారు. అన్నింటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారు. ఇందులో మహిళలకు కూడా ఎక్కడా ప్రాతినిధ్యం తగ్గకుండా సగభాగం వారికే పదవుల్లో వైయస్‌ జగన్‌ అవకాశం కల్పించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి.
ఈ రోజు మంత్రి వర్గంలో మహిళలు నలుగురుకి అవకాశం కల్పించాం. గతంలో ముగ్గురే ఉండేవారు. అప్పట్లో ఓ మహిళకు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. మహిళలకు పూర్తి ఆత్మసై్థర్యంతో, విధానపరమైన నిర్ణయాలతో పాలు పంచుకునేలా అందరికీ వైయస్‌ జగన్‌ అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఎన్నికల కోసం చేస్తున్నది కాదు. పార్టీలో అందరు ఎమ్మెల్యేలు అర్థం చేసుకున్నారు కాబట్టే వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఓ వర్గం మీడియా పార్టీలో అసంతృప్తి ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. కానీ మా పార్టీలో అసంతృప్తికి చోటు లేదు.  కేబినెట్‌ పదవి అన్నది అధికారమే తప్ప హక్కు కాదు. 
151 మంది ఎమ్మెల్యేలు, 25 కేబినెట్‌ బెర్తులు మాత్రమే ఉన్నాయి. అందరికి మంత్రులుగా అవకాశం రాదు. కొంత మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం. పదవి వస్తే ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదు. రాకపోతే ప్రాధాన్యత ఇవ్వన్నట్లు అసలే కాదు. రాబోయే ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే నాయకులను జిల్లా స్థాయిలో కొంత మందిని, రాష్ట్రస్థాయిలో మరికొంత మందిని వాడుకుంటాం. రకరకాల బాధ్యతలు ఇచ్చి ప్రా«ధాన్యత కల్పిస్తాం. అవకాశం రాలేదని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకు బీ ఫారం ఇచ్చి గెలిపించుకున్నది వైయస్‌ జగన్‌మాత్రమే. అందరిపై సీఎం వైయస్‌ జగన్‌కు ఒకే రకమైన అభిప్రాయం ఉంది. రాగధ్వేషాలకు అతీతంగా వైయస జగన్‌ కెబినెట్‌ కూర్పు చేశారు. జిల్లాలు, సామాజిక వర్గాలను బట్టి కూర్పులో ప్రాధాన్యత ఇచ్చారు. మహాయజ్ఞంలా రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది. వెనుకబడిన వర్గాలకు మొదటిసారిగా మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు.
డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ముదునూరు ప్రసాదరాజు, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణు, స్టేట్‌ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌బోర్డు చైర్మన్‌గా కొడాలి నానిని నియమించి ప్రాధాన్యత కల్పించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందరిని బ్యాలెన్స్‌ చేయడంలో సీఎం వైయస్‌ జగన్‌ సఫలీకృతం అయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 

 

తాజా వీడియోలు

Back to Top