తాడేపల్లి: ప్రజల ఆగ్రహానికి చంద్రబాబే బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలపైనే నిన్నటి రియాక్షన్ ఉందని తెలిపారు. టీడీపీ నేతలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, అన్ని హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల భాష రోజు రోజుకు దిగజారిపోతోందన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తమని చంద్రబాబుకూ తెలుసు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే బండ బూతులు తిట్టడమా అని నిలదీశారు. కోట్లాది మంది అభిమానించే సీఎం వైయస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే నిన్నటి ఘటనకు కారణమైందని, ఈ ఘటనలకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినా..అలా మాట్లాడించింది మాత్రం చంద్రబాబేనని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పట్టాభి మాట్లాడిన తీరు ఆవేశంతో మాట్లాడినట్లు లేదన్నారు. టీడీపీ నేతలు నిరాశ, నిస్పృహల్లో ఉంటూ సీఎం వైయస్ జగన్‌పై, ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.వ్యూహం ప్రకారం కావాలనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుపట్టారు. సీఎం వైయస్ జగన్‌పై కావాలనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని, పదేపదే కావాలనే ఆ తప్పుడు మాటలను ఆయన ఉపయోగించారన్నారు. ఇలాంటి దారుణ వ్యాఖ్యలకు ఎవరైనా రియాక్ట్ అవుతారన్నారు. కొంతకాలంగా మేం సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. మా సంయమనాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు మొదటి నుంచి ప్రజా రాజకీయాలు తెలియవన్నారు. పట్టాభి అనుచిత వ్యాఖ్యలపైనే నిన్నటి రియాక్షన్ జరిగిందన్నారు. కోట్లాది మంది అభిమానించే నేతపై దారుణమైన పదజాలం వాడారని తప్పుపట్టారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. రెండున్నరేళ్లుగా సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల్లో ఆయన సంపాదించుకున్న స్థానం, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించడం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. సీఎం వైయస్ జగన్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఈ స్థాయికి దిగజారారు. గంజాయి సాగుపై అనుమానంతో టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబును పోలీసులు విచారణకు పిలిచారు. ఆయన్ను ఎవరూ వేధించింది లేదు. గతంలో ఎమ్మెల్యే రోజాను ఎంతగా వేధించారో, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎలా తిప్పారో అందరికి గుర్తు ఉంది. టీడీపీ నేతలు ఎందుకు ప్రెస్‌మీట్లలో బండబూతులు తిట్టారు. అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే. గతంలో కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్ద నిరసన చేపట్టేందుకు వెళ్తే నిమిషాల్లో టీడీపీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారే..నిన్న టీడీపీ ఆఫీస్ వద్ద ఎందుకు లేరు. చంద్రబాబు అమీత్‌షాకు ఫోన్ చేసినా, ఇంకా ఎవరితో మాట్లాడినట్లు చెప్పారు.
గతంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చెత్త నాకొడుకు అన్నారు..ఓ మై సన్ అంటూ వెలికి చేష్టాలు చేశారు. మహిళా హోం మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎందకు రియాక్షన్ ఉండదు. ముఖ్యమంత్రిని పట్టుకుని బండ బూతులు తిడితే రియాక్షన్ వచ్చింది. దీనికి బాధ్యత చంద్రబాబే వహించారు.
నిన్నటి ఘటనతో హడావుడిగా కొన్ని పార్టీలు కూడా రియాక్ట్ అయ్యాయని, వీళ్లందరిని ఇదే మాటలు మాట్లాడితే వారు ఊరకుంటారా? వారిని అభిమానించే వారు మౌనంగా ఉంటారా? అనుచితంగా అని ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని అంటున్నారు. ఇక్కడ సీఎం వైయస్ జగన్ రియాక్ట్ కాలేదు. కార్యకర్తల్లో ఎక్కువ అభిమానం ఉన్న వారు నిలదీసేందుకు టీడీపీ ఆఫీస్‌కు వెళ్లారు. ఆ సమయంలో తిట్టిన వారు దొరకపోవడంతో ఆవేశానికి లోనయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చే స్తుంటే వీళ్లకు వినపడలేదా? కనిపించడం లేదా? .
ఇలాంటి వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం అనాలా? చెత్త నా కొడుకు అన్నప్పుడు చెత్తలో వేసి తొక్కి ఉండాల్సిందా? చత్తీష్‌ఘడ్‌లో సీఎంను ఏదో అన్నందుకు చెంప దెబ్బ కొట్టారు. చివరకు క్షమాపణ కూడా చెప్పారు. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇలాంటి పదజాలం పాలిటిక్స్‌లో ఓ ట్రెండ్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం చేయవచ్చు. సబ్జెట్‌పై మాట్లాడండి. తిట్లు అన్నవి చేతకాని వాళ్లు, అసమర్ధులు చేసేవి. ఇలాంటివి సమర్ధించాలా? రేపు మీకే ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఎలా రియాక్ట్ అవుతారు. నిన్నటి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి. మేం రాజకీయంగానే ఎదుర్కొంటున్నాం. అందుకే టీడీపీ నేతల ఇంటి వద్దకు వెళ్లి అడగాలనుకుంటున్నాం.మీ అధ్యక్షుడికి ఇంత గడ్డి పెట్టమని కోరుతున్నాం.
ఇంత జరిగితే ఆ పెద్ద మనిషి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పట్టాభి ఇలా మాట్లాడి ఉండకుండాల్సింది. పైగా మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటున్నాడు. ప్రజాస్వామ్య స్పూర్తి అంటున్నాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు తిట్టడమా? . కొన్ని పత్రికలైతే పట్టాభి ఏమన్నాడో రాయలేదు. ఇటువైపు జరిగింది మాత్రం ఫుంకాలు పుంఖాలుగా రాశారు. ఇది సంస్కారం అనిపిస్తుందా? . ఇలాంటి భాషవాడొద్దని ఎంత చెప్పినా అదే వాడుతున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి భాష వాడితే కచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. ఛీము నెత్తురు ఉన్న వారు ఎందుకు మౌనంగా ఉంటారు.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది.
నిన్నటితో టీడీపీ హద్దులు దాటింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు విలువలు లేవు. ప్రతి దాంట్లో అబద్ధాలు అల్లి రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. చంద్రబాబు బద్వేలు ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. ఇదీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం. ఎందుకు తప్పించుకుని పోయారు. మీరు చెప్పే అభూత కల్పనలు జనం నమ్ముతున్నారని భ్రమల్లో ఉన్నారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. చంద్రబాబు రేపు దీక్షా ఎందుకు చేస్తున్నారో చెబితే బాగుంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పులేదని చెబితే బాగుంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.