ఒక్క స్కూల్‌ మూతపడదు..ఒక్క ఉద్యోగం కూడా పోదు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఉద్యోగాల కల్పనపై చంద్రబాబును ఎప్పుడైనా నిలదీశారా?

ఐదేళ్లలో చంద్రబాబు ఇచ్చింది కేవలం 34 వేల ఉద్యోగాలే

రెండేళ్లలో వైయస్‌ జగన్‌ సుమారు 2 లక్షల ఉద్యోగాలు కల్పించారు

మా ప్రభుత్వ విజయాలు రామోజీరావుకు కనిపించవా?

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చాం

ఉద్యోగాల భర్తీపై ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం

తప్పుడు రాతలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం

తాడేపల్లి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఒక్క స్కూల్‌ మూతపడదు..ఒక్క ఉద్యోగం కూడా పోదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం వైయస్‌ జగన్‌ ఉపాధ్యాయ సంఘాలకు స్పష్టం చేశారని వెల్లడించారు. రెండేళ్లలో సీఎం వైయస్‌ జగన్‌ 2 లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రియార్టీ ప్రకారం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల శాతం భారీగా పెరిగిందని చెప్పారు. నాడు–నేడు కింద విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధికారంలోకి వచ్చిన తరువాత ఓ వర్గం మీడియా కంటిన్యూయస్‌గా విషం  కక్కడం, వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వంపై దాడి చేయడం.. శూన్యం నుంచి లేనిది సృష్టించి ప్రజలను భ్రమలో ఉంచి మభ్యపెట్టాలని కుట్రలు చేస్తున్నారు. మా పార్టీకి వ్యతిరేకంగా ప్రజల మెదళ్లలో విషం నింపాలనే దోరణితో ఎల్లోమీడియా ఒక యజ్ఞంలా కుట్రలు చేస్తున్నాయి. ఇది అందరూ గమనిస్తున్నారు. ఇందులో భాగంగా రామోజీరావు ఈనాడు కొంత సోధించి సారం తీసినట్లుగా ఆలోచించే ప్రజలను కూడా కన్‌ఫ్యూజ్‌ చేసేరకంగా కథనాలు అల్లితే..మరోవైపు చౌకబారు, నీచమైన, అంతులేని స్థాయిలో బూతు స్థాయిలో ఓ పత్రిక తయారైంది.

ఈ రోజు ఈనాడు ప్రతిక మొదటి పేజీలో ఉపా«ధ్యాయుల పోస్టుల భర్తీ, హామీ నెరవేరదేమీ? అంటూ బ్యానర్‌ కథనం రాశారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్లుగా విద్యరంగంలో చేస్తున్న విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఊరులో జరుగుతున్న మార్పులు చూస్తున్నారు. పాఠశాలల్లో భవన  నిర్మాణాలు, వసతులు, పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు అందరూ చూస్తున్నారు. స్కూల్‌ యూనిఫాం, పుస్తకాలు మేలిరకంగా అనుభవిస్తున్నారు. దానికారణంగానే క్వాలిటీ ఇన్‌ఫ్రూ అయినట్లు అందరూ ఒప్పుకున్నారు. ఈనాడు కూడా ఒప్పుకోంది. కారణం కరోనా అని రాశారు కానీ అసలు కారణం రాయలేదు. 
మా ఊరులో స్కూల్‌లో మార్పులు వచ్చాయి. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ వచ్చిందని జనం చర్చించుకుంటున్నారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అమ్మ ఒడి పథకాల గురించి మాట్లాడటం లేదు. ఇది కాకుండానే విద్యా రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అబద్ధం కోణంతో  తప్పుడు కథనాలు పబ్లిస్‌ చేస్తున్నారు. ఏమీ ఆశించి ఈ కథనం రాశారు. వాళ్ల బాధ ఏంటో అర్థం కావడం లేదు.

మా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అవుతుంది. ఈ సమయంలో ప్రియారిటీ ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. అత్యంత ప్రాధాన్యంగా విద్య, వైద్య రంగాన్ని తీసుకున్నారు. ఇన్నేళ్లు అనుభవం ఉన్న పత్రిక నిజంగా న్యూట్రల్‌గా రాయాలనుకుంటే..ఇందులో మార్పు జరిగిందా? లేదా అన్నది రాయాలి. ఆ రోజు వైయస్‌ జగన్‌ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ రెండేళ్లలో 1.83,470 రెగ్యులర్‌ ఉద్యోగాలు కల్పించారు. ఇందులో 51,960 ఆర్టీసీ ఉద్యోగాలు కల్పించారు.  1.30 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే గ్రామ సచివాలయాల్లో ఇచ్చారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసేనాటికి 5,14,056 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఈ రోజు 6,96,526 ఉద్యోగాలు అయ్యాయి.  కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన సందర్భం ఎప్పుడైనా జరిగిందా?.రామోజీ రావుకు సృహ ఉంటే ఈ వాస్తవాలను విశ్లేషించాలి.

2014–2019లో ఇలాంటి బ్యానర్‌ కథనాలు రామోజీ రావు ఎందుకు రాయలేదు. చంద్రబాబు ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. 9,081 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన చంద్రబాబు 8031 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం. చంద్రబాబు హయాంలో 34 వేల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇచ్చారు. ఏ మోహం పెట్టుకొని ఈ పత్రిక, టీవీలు, వీళ్లు మోస్తున్న చంద్రబాబు, ఆయన కుమారుడు పొద్దున లేస్తే మొత్తుకుంటున్నారే? వీరికి సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఉన్నాయా? ఇవి వేసే ముందుకు వాస్తవాలు చెప్పి ఉంటే బాగుండేది.
రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎక్కడా రాయడం లేదు. ఇది ఎందుకు చేయడం అన్నది మాత్రమే రాస్తున్నారు. మా ప్రియారిటీ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. కామన్స్‌ సెన్స్‌ ఉన్న వారు అర్థం చేసుకుంటున్నారు.

పొద్దున లేచింది మొదలు వైయస్‌ జగన్‌పై బండలు వేస్తూ బాబు మెప్పు పొందాలని తాపత్రయపడుతున్నారు. చంద్రబాబు రేషనలైజేషన్‌ పేరుతో స్కూల్స్‌ మూసివేయలేదా? అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఎందుకు ఇలా చేశాడు. చివరకు విద్యారంగాన్ని అస్థవ్యస్తంగా మార్చారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ గాడిలో పెడుతున్నారు. మన పిల్లలు ఎక్కడైనా పోటి ప్రపంచంలో నెగ్గాలని వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారు. రుచికరమైన భోజనం పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. టీచర్లకు ఎప్పటికప్పుడు జ్ఞానం పెంచుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. 

టీడీపీ హయాంలో బడ్జెట్‌లో మధ్యాహ్నం భోజనం పథకానికి రూ.515 కోట్లు పెడితే..మా ప్రభుత్వం రూ.1600 కోట్లు పెట్టింది. అప్పట్లో ఆయాలకు రూ.1000 ఇచ్చే వారు.. మేం అధికారంలోకి రాగానే రూ.3000లకు పెంచాం. ఇందులో 80 వేల మంది లబ్ధి పొందుతున్నారు. జగనన్న కిట్లు, యూనిఫాం, పుస్తకాలు సకాలంలో ఇస్తున్నాం. గతంలో సమయానికి పుస్తకాలు అందేవి కావు. కానీ ఏ రోజు బ్యానర్‌ చేసి ఈనాడు పత్రిక రాయలేదు.

చంద్రబాబు 620 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మేం అప్పట్లో ఈ హామీలపై ప్రజల వద్దకు వెళ్లే ఈనాడు రాయలేదు. మీ అజెండా అంతా ఒక్కటే చంద్రబాబును ఎలా అధికారంలోకి తీసుకురావాలి. వైయస్‌ జగన్‌ను ఎలా దించాలని తాపత్రయపడుతున్నారు. వైయస్‌ జగన్‌ ఎప్పుడు ఇలాంటి అజెండా తీసుకోలేదు. మీ కడుపు మంట, దుగ్ధ పెరిగిపోయి అల్సర్‌గా మారింది. కడుపు మంటతో అల్లాడిపోతున్నారో మీ పత్రికలు చూస్తే అర్థమవుతుంది. రామోజీరావుకు ఇప్పుడు 80 ఏళ్లు దాటాయి. ఇప్పుడైనా ఉన్న విషయం ఒప్పుకుందాం..ఇక్కడ తప్పుజరిగింది దాన్ని  పాయింట్‌ అవుట్‌ చేద్దాం.  చంద్రబాబు ఇది పద్ధతి కాదు..ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నించు.. మన ఖర్మ కాలి రాష్ట్రంలో ఈనాడు సర్యూ్యలేషన్‌ బాగా ఉంది. ఇంకో పత్రికకు టీవీ ఉంది. వీళ్లు ప్రజల్లోకి విషం తీసుకెళ్తున్నారు. ఆ రాతలు, పత్రికలు చూస్తే జనం ఏమనుకుంటారో కూడా వారికి ఆలోచన లేదు.  రాసిన దానిపై విశ్వసనీయత అన్నది లేకపోయినా కూడా ధైర్యంగా రాస్తున్నారు.  మతిస్థిమితం లేదా అనుకుంటే పొరపాటే.. వారి ఆలోచనలు వంకరగా ఉన్నాయి. కడుపు మంట మొత్తం పత్రికలతో చూపుతున్నారు. ఉద్యోగాలు కొత్తగా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

 సీఎం వైయస్‌ జగన్‌ కచ్చితంగా  చెబుతున్నారు. ఒక్క స్కూల్‌ కూడా మూత పడదు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా తీసివేయం. అంగన్‌వాడీలతో సహ ఎక్కడ కూడా ఉద్యోగాలు తీసివేయమని చెప్పారు. అందుకే నూతన విద్యా విధానం ప్రకారం ముందుకు వెళ్తున్నాం. టీచర్‌ యూనియన్స్, పేరెంట్స్‌ కమిటీలు ఉన్నాయి. అంగన్‌వాడీల్లో ఆధునిక ఆలోచన దోరణితో, శాస్త్రపరంగా పిల్లల మేధాస్సు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రైమరీ స్కూళ్లలో 2వ తరగతి వరకు ఒక వి«భాగం, 3వ తరగతి నుంచి హైస్కూల్‌లో మెర్జ్‌ చేస్తున్నాం. అంగన్‌వాడీల్లో పిల్లల మేధో వికాసం  పెంచే ప్రయత్నం జరుగుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ సొంత విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. బెస్ట్‌ ఎడ్యూకేషన్, బెస్ట్‌ ఇన్‌ఫ్రాక్చర్, బెస్ట్‌ టీచర్స్‌ విధానంతో పని చేస్తున్నారు. ఒక్క ఉద్యోగం కూడా తీసివేయడం లేదు. అంగన్‌వాడీల్లో కూడా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3వ తరగతి నుంచి ఆపై తరగతులను హైస్కూల్‌లోకి తీసుకువస్తే..అక్కడ ప్రోఫెసనల్‌ టీచర్స్‌ ఉంటారు. మంచి విద్య అందే అవకాశం ఉంది. అన్ని చోట్లా అదే జరుగుతుంది. కేంద్రం కూడా ఇలాంటి గైడ్‌లైన్స్‌  ఇచ్చింది. ఈ ప్రక్రియలో మొత్తం వేకెన్సీలు ఉంటే..ఆ ఖాళీలను నింపకపోతే ప్రశ్నించవచ్చు. టీచర్, స్టూడెంట్‌ రేషియో ప్రకారం నియామకాలు చేపడుతాం. కొద్ది రోజులు వేచి చూసి అడగండి. ఈ ప్రభుత్వం ఎక్స్‌ఫెక్ట్‌ చేస్తున్న ప్రయత్నాల గురించి రాస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మీ కడుపు మంట మాత్రమే మీ కథనాల్లో కనిపిస్తోంది.
జాబ్‌ క్యాలెండర్‌ గురించి మాట్లాడుతున్నారు..రెండేళ్లలోనే వైయస్‌ జగన్‌ 1.86 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన క్యాలెండర్‌ వన్‌టైం సెటిల్‌మెంట్‌ కాదే..ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ ఉద్యోగాలు ఇస్తాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే ..ఇలాంటి తప్పుడు రాతలు నమ్మొద్దు. రెండేళ్లలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం చిన్న విషయం కాదు. దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు. మిమ్మల్ని మభ్యపెట్టే రాతలు నమ్మొద్దు. ఇలాంటి రాతలతో మీ అజెండా నెరవేరదు.

పదేళ్లుగా వైయస్‌ జగన్‌ను తొక్కేయాలని చూసి..చివరకు మీరు నమ్ముకున్న చంద్రబాబు, ఆయన పార్టీ కూడా అధోగతి పాలైన, జనం తిరస్కరించి అరడుగల గోతిలో పాతిపెట్టినా..ఈ రెండేళ్లలో జరిగిన ఏ ఎన్నిక చూసినా వైయస్‌ఆర్‌సీపీకే ప్రజలు పట్టం గట్టారు. సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న పనులు బ్రహ్మండంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు మా పార్టీని ఆదరిస్తున్నారు. వైయస్‌ జగన్, ప్రభుత్వం భరోసా ఇస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ఈ వాస్తవాన్ని ఎల్లోమీడియా, ప్రతిపక్షం ఎందుకు గమనించడం లేదో అర్థం కావడం లేదు.

పేజీలకు పేజీలు ఎందకు వృథా చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. మీరు రాళ్లు వేస్తే..మేం దాన్ని తిప్పి కొట్టేందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తోంది. అంగన్‌వాడీల గురించి వైయస్‌ జగన్‌ ఎంతగా ఆలోచిస్తున్నారంటే..చదువు చెప్పే వాళ్లు బాగుండాలి. పిల్లలు ఎక్కడైనా పోటీ పడాలని ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే బిల్డింగ్‌లు అవసరమవుతాయో..అక్కడ బిల్డింగ్‌లు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు సొంతూరులో ప్రభుత్వ పాఠశాలను ఆయన పట్టించుకోలేదు. దాన్ని ఈ ఎల్లోమీడియా ఎప్పుడు ప్రశ్నించదు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత వీటి గురించి ఆలోచన చేసింది.

ఈనాడు, ఆంధ్రజ్యోతిని నమ్ముకొని, కొంత మంది కుల గురువులను నమ్ముకొని, వ్యవస్థల్లో ఉన్న కొంత మందిని నమ్ముకొని, డబ్బు, అక్రమ వ్యాపారాలను నమ్ముకొని, బ్యూరోక్రసీలో ఉన్న ఒక సెక్షన్‌ను నమ్ముకొని ఎంత కాలం అధికారంలో ఉండాలనే ఆలోచన చేస్తున్నారు. అదే రాచకార్యంగా ఈ పత్రికలు, టీవీలు నడుస్తున్నాయి.
జులై 1వ తేదీ నుంచి మెగా గ్రౌండింగ్‌ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పేద కుటుంబాలు లక్షరూపాయలకు పైగా నేరుగా లబ్ధి పొందింది. ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి. ఇలాంటి పేపర్లు ఉన్నంత వరకు తప్పుడు ప్రచారం తప్పదు. మేం సమాధానం చెబుతూనే ఉంటాం.

వైయస్‌ షర్మిలమ్మ తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నారు. ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉంటాయి. వైయస్‌ఆర్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.  రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే వైయస్‌ జగన్‌ ఆశయం. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోం..ఇందులో ఏమరుపాటు ఉండదు. 

కోవిడ్‌ బాధితులను ఆదుకోవడం లేదని ప్రతిపక్షం అనడం బాధాకరం. లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు నిర్వహించాం. దేశంలోనే ఏపీ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోంది. చంద్రబాబు విచిత్రమైన ధోరణితో ప్రవర్తిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 

 

Back to Top