సీఎం వైయస్‌ జగన్‌కు వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు 

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

కక్షసాధింపులో భాగంగానే ఆనాడు వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టారు

గతంలో ఏ ప్రభుత్వంపై లేనన్ని కేసులు మా ప్రభుత్వంపైన వేశారు

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట

టీడీపీ నేతలపై ఉన్న కేసులను ఆనాటి ప్రభుత్వం కొట్టేసింది

కక్షసాధింపుల్లో భాగంగానే ఆనాడు వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టారు

వైయస్‌ జగన్‌పై ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానళ్లు విషప్రచారం చేస్తున్నాయి

పెట్రోల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు

కేటాయింపులకు అనుగుణంగానే ఏపీ ప్రాజెక్టులు

ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నాం

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

వరద జలాలను ఒడిసి పట్టుకునేందుకే ఏర్పాట్లు చేసుకుంటున్నాం

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే పరీక్షల నిర్వహణ

  తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనన్ని కేసులు ఏపీ ప్రభుత్వంపైన వేశారని విమర్శించారు.  పదేపదే కేసులు వేస్తూ ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కక్షసాధింపులో భాగంగా ఆనాడు వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టారని తెలిపారు. చంద్రబాబు వ్యవస్థల్లో ఉన్న కీలక వ్యక్తులను కుట్రలకు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం చేస్తున్నాయని, సీఎం వైయస్‌ జగన్‌పై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  పెట్రో ధరలు ఎవరు పెంచారో చెప్పకుండా ఈనాడు రామోజీ రావు వార్తలు రాస్తున్నారు.  రాష్ట్ర ప్రయోజనాలకే మా ప్రభుత్వానికి ముఖ్యమని, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్ష నేత హోదాలో అప్పట్లో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆందోళనలోనో, ప్రజల తరఫున బాధ్యత గల ప్రతిపక్ష నేతగా మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలోనో ..అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉండగా పెట్టిన కేసులు, ఆ తరువాత సుప్రీం కోర్టు గైడ్‌లైన్‌ ప్రకారం రాజకీయ నాయకులపై ఉన్న కేసులపై వేగంగా ఇన్విస్టేగేషన్‌ చేసి కింది కోర్టులు ఇచ్చిన ఆదేశాలతో కేసులు క్లోజ్‌ చేశారు. రెండో అధ్యాయంగా నిన్న దాన్ని  హైకోర్టులో సుమోటోగా  టేకాఫ్‌ చేసిన విషయం అందరు గమనించిందే.
ఇదే విషయంపై గతంలో రిటైర్డు అయిన హైకోర్టు జడ్జి రాకేష్‌కుమార్‌ విచారణకు టేకాఫ్‌ చేయడం, ఆ తరువాత దానిపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు, ప్రభుత్వ అధినేతపై, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టుపై స్టే తీసువచ్చాం. దీన్ని కొత్తగా తిరగదోడటం మనం గమనించాం. ఇందులో న్యాయపరమైన హక్కును గురించి ప్రస్తావించడం లేదు.

ఏదైతే తిరిగి టేకాఫ్‌ చేసిన తీరు..దానికి ముందు ఏ శక్తులు అయితే వైయస్‌ జగన్‌కు వ్యతిరేకంగా, మాపార్టీకి వ్యతిరేకంగా మొగ్గలో నుంచే తొక్కేయాలనే శక్తులు..వారికి ఉన్న మీడియా బలం, అంగబలం, మాయాబలంతో గత పదేళ్లుగా ఇదే ప్రయత్నం చేస్తున్నాయి. వాటి  వీరంగం చూసి ఆశ్చర్యమనిపిస్తోంది. ఒక భయంకరమైన హత్యకేసో, లేదా భరించలేని, ఊహకందని నేరాలు ఆ కేసుల్లో ఉన్నట్లుగా వాటి గురించి పెద్ద పెద్ద స్టీమర్స్‌ పెట్టడం, బ్యానర్‌ కథనాలు రాయడం చూస్తే..ఎక్కడి నుంచి ఒక సమన్వయంతో కూడిన ప్రయత్నం, ఒక రకమైన దూకుడు ఎక్కడి నుంచి వచ్చిందో..యుద్ధంలో సమన్వయంతో వెళ్లినట్లుగా ఉంది. ఏ శక్తులు వీరికి కోఆపరేట్‌ చేస్తున్నారో అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. 

కేసులకు సంబంధించి  నిన్న రాత్రి 8 గంటల తరువాత కోర్టులో టేకాఫ్‌ చేస్తారని లిస్టు రిలీజ్‌ అయితే సమాచారం అందితే..నిన్న మధ్యాహ్నమే మాకు సమాచారం ఉందని ఓ మీడియా చానల్‌లో ఓ హీరో చెప్పడం. అలాగే దానిపై చర్చ కూడా మొదలుపెట్టేయడం. మీడియాలో అన్ని చోట్లా తెలియలేదు. వీరికే ఎలా తెలిసింది. ఇది ఇవాళ కొత్త కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా వ్యవస్థల్లో  వీళ్లకు ఉన్న  సంబంధాలతో ఇన్‌ఫ్యూ›్లయన్స్‌ ఉపయోగించారు. చాలా సార్లు వాళ్లు సక్సెస్‌ఫుల్‌గా చేశారని అందరూ అనుకుంటున్నారు. వాళ్లు విభిన్నమైన రూపాల్లో ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. 

ఇప్పుడు ప్రభుత్వంలోకి మేం వచ్చాం. మిగిలింది మాత్రం అలాగే..మరింత పకడ్బందీగా జరుగుతుంది. ఈ కేసుల విషయంలో గతంలో ఇలాంటివి గమనిస్తే..వైయస్‌ జగన్‌పై పెట్టిన కేసులు కేసులే కావు. ఆ రోజు వైయస్‌ జగన్‌ ఏమన్నారు..చీపుర్లతో కొట్టండి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోయి టెలీఫోన్‌ ఆడియోలతో అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై ఉల్టాగా మా నాయకుడి వాయిస్‌తో ఫేక్‌ చేశారని మాపై కేసులు పెట్టారు. టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి బస్సు అప్పట్లో యాక్సిడెంట్‌ అయితే..ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. దీంతో ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్‌ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ కేసులో బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదు. ఆ సందర్భంలో వైయస్‌ జగన్‌ ఎక్కడా దురుసుగా ప్రవర్తించినట్లుగా లేదు.

మరో విచిత్రం ఏంటంటే..అమరావతిలో స్కామ్‌ ఉందని చెప్పడం ద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టారు. లక్షల్లో రేట్లు పyì పోయానని çకేసులు పెట్టారు. ఇలాంటి కేసుల్లో వేగంగా విచారణ చేసింది. కింది కోర్టులు నిర్ణయాలు తీసుకున్నాయి. వీటిపై కోర్టులు మళ్లీ చూసినా కూడా అభ్యంతరం లేదు. మేం అడుగుతున్నది వీరంగం చేస్తున్న శక్తుల గురించి.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 130కి పైగా జీవోలు విడుదల చేసి కేసులన్నీ విత్‌డ్రా చేసుకున్నారు. అందులో క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మహిళను అవమానించారని అచ్చెన్నాయుడిపై కేసు ఉంది. అప్పటి స్పీకర్‌ కొడెల శివప్రసాద్‌ అధికారుల విధులకు అడ్డం వచ్చారని కేసులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అన్న కేసులు సుమారుగా ఉన్నాయి. దేవినేని ఉమా పోలింగ్‌ గంటకు పైగా ఆపేశారని, గంటా శ్రీనివాస్‌రావుపై 307 కేసు కూడా ఉంది. చట్టపరంగా వీటిని ఎత్తివేయకూడదు. కొడెల, అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమాతో పాటు టీడీపీకి చెందిన కీలక నేతల కేసులన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొట్టేశారు. చివరకు 2019 ఎన్నికల కోడ్‌ వచ్చేలోగా వాటిని విత్‌డ్రా చేయించుకున్నారు. 

అప్పట్లో వైయస్‌ఆర్‌సీపీ టికెట్‌పై గెలిచిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మా పార్టీలో ఉండగా ఎడాపెడా కేసులు బాదడంతో..కేసులకు తట్టుకోలేక టీడీపీలో చేరిపోయారు. వెంటనే కేసులు విత్‌డ్రా చేసుకున్నారు.అడ్డంగా కేసులు తీసేశారు. ఎప్పుడు కూడా వీటి గురించి మేం పట్టించుకోలేదు. మాకు సంబంధించి రిలయన్స్‌ కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి.  ఆ రోజు మీరు చేసిన దాంతో పోలిస్తే..ఈ రోజు డూప్‌ ప్రాసెస్‌ పూర్తి చేసిన కేసులకు సంబంధించిన వరకు కోర్టు తీసుకున్న ఓ నిర్ణయాన్ని సుమోటోగా పరిశీలించాలనుకుంటే..సాంకేతికంగానో, న్యాయపరంగానో ఎదుర్కొంటాం. వీళ్ల ఆనందం ఏంటో అర్థం కావడం లేదు.

కోర్టులో భుజాలమీద తుపాకి పెట్టి కాల్చాలనే ప్రయత్నం..ప్రభుత్వాన్ని మించిన శక్తితో నడిపించాలనే ఆత్రుత టీడీపీ నేతల్లో..ముఖ్యంగా చంద్రబాబులో బాగా కనిపిస్తోంది. ఇప్పుడు కాదు..ముందునుంచే వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ దాని ద్వారా ఎంటైర్‌ సిస్టమ్‌ను కంట్రోల్‌ చేయాలని భావిస్తున్నాడు. అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని, లేకుంటే మీడియా, కోర్టులు..ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని ఎలా వేధించవచ్చు. అధికార యంత్రాంగం వారి పనులు చేసుకోకుండా కాన్‌ఫ్రెన్స్‌ జుడిషియల్‌ స్క్రూటిని పేరు మీద ఎలా వేధింపులకు గురి చేయవచ్చో..కోట్లలో డబ్బులు వెచ్చించి పెద్ద పెద్ద లాయర్లను తీసుకువచ్చేది చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. 

ఈ ప్రక్రియలో ఎల్లో మీడియా, టీడీపీ అప్రకటిత అధికార ప్రచార కర్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 చానల్‌ వరకు ఒక గూడిపుటాని జరిపినట్లు, సమన్వయ కుట్రతో మా నాయకుడికి, ప్రభుత్వానికి  వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలు. దీనికి అనుకూలంగా వ్యవస్థలను మేనేజ్‌ చేయడం కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. 

శూన్యంలో నుంచి కూడా ఏదైనా క్రియేట్‌ చేయవచ్చు అన్న వీళ్ల కుట్రలను ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే వాళ్లకు ఆందోళన కలిగిస్తోంది.మా ప్రభుత్వం వచ్చాక వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక...రొటిన్‌గా యాక్టివిటీ నడుస్తోంది. కానీ ప్రతి రోజు ఓ వర్గం మీడియా అసత్యాలతో కథనాలు రాస్తోంది. మీడియా అంటే విశ్వాసం ఉన్న వాళ్లు..వీళ్లు రాసే కథనాలతో నిప్పు లేకుండానే పొగ వస్తుందా అని అనుమానిస్తున్నారు. ఈ వార్తలు చూడగానే ప్రజలు కొంతైనా నిజం ఉండదా అని భావిస్తారు.  ఎక్కడో ఒక చోట గందరగోళం సృష్టిస్తున్నారు. తరుచుగా న్యాయస్థానాలు  ఇంతగా ప్రశ్నిస్తాయని కొంత మంది అనుకునే అవకాశం ఉంది. 

ప్రభుత్వాల పనితీరును అంచనా వేసే హక్కు, రాజ్యాంగాన్ని కాపాడే హక్కు హైకోర్టు, సుప్రీం కోర్టు ఉంటుంది. ఈ విషయంలో ఎవరూ కాదనరు. ఎక్కడో విచక్షణ అన్నది ఒక్కటి ఉంటుంది. ఆ లైన్‌ను క్రాస్‌ అయినట్లు ప్రజల్లోకి ఆ మెసెజ్‌  పోతే..దాని వల్ల ఎవరికి క్రెడిట్‌ కాదు..ఓవరాల్‌గా ప్రజాస్వామ్య వ్యవస్థకే నష్టం కలిగించే ఒక చర్య కిందకు మారుతుంది.

తమిళనాడు ఎన్నికల సమయంలో కోర్టు ఎన్నికల కమిషన్‌పై కొన్ని కామెంట్లు చేసింది. దానిపై సుప్రీం కోర్టు స్పందించింది.  చాలా సంయమనంతో ఉండాలని న్యాయస్థానాలు కామెంట్‌ చేశాయి.  ప్రజాక్షేత్రంలో ఓ పొలిటికల్‌ పార్టీని గుర్తించి అధికారం ఇచ్చారంటే వారికి విశ్వాసం ఉండబట్టే కదా? ఈ పరిస్థితి మన రాష్ట్రంలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎలా ఉండబోతుందో కూడా కనిపిస్తోంది. వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడు ఉన్న రూల్స్‌ ప్రకారమే పరిపాలన సాగిస్తోంది. దిగజారి వ్యవహరించే ఓ మీడియా ఉందని గుర్తెరిగి, బాధ్యత గల స్థానంలో ఉన్న  వాళ్లు ఎవరైనా సరే వ్యవహరించడం అవసరం అని భావిస్తున్నాను.

 ఎల్లోమీడియా ఎంత దాకా వెళ్లిందంటే..ఈ రోజు ఈనాడులో రైతన్నలపై పెట్రో మంటలు అని కథనం రాసింది. ఈ కథనంలో ఎక్కడా కూడా కేంద్రానిదే బాధ్యత అని రాయలేదు. అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు అదే పరిస్థితి. ఏపీలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఎల్లో మీడియా బోన్‌లో పెట్టడమే అని భావించాలి. 

టూరిస్ట్‌ హోటళ్లలో మందు, లిక్కర్‌ అమ్మకాలు ఉంటాయి. వైజాగ్‌ డాల్ఫీన్‌ హోటల్‌లో లిక్కర్‌ ఉండదా? టీడీపీ పుట్టినప్పటి నుంచి కూడా ఈనాడు బరువంతా మేస్తున్నారు. మద్యనిషేధం అనుకుంటే ఈ పత్రికే డోల్‌ కొట్టడం..కావాలంటే మళ్లీ వీళ్లే స్టోరీలు రాయడం. మా పత్రిక సాక్షి ఉంది. అందులో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకున్నాం. ఎక్కడా కూడా వన్‌వేలో వెళ్లలేదు. అన్ని రకాల వార్తలు రాస్తోంది. ఎల్లోమీడియా ప్రజలకు అవసరమైన పనులు చేయదు. మా నాయకుడు అలా కాదు. ప్రజల్లోకి వెళ్లాడు..ఒక్కడే పార్టీని నడిపించారు. అధికారంలోకి తెచ్చాడు. ప్రజలు అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అందుకే ఈ రెండేళ్లలో ఏ ఎన్నికలు జరిగినా కూడా వైయస్‌ఆర్‌సీపీని ప్రజలు ఆధరించారు. 

మీరు క్రియేట్‌ చేసిన పాత్రలు ఎన్ని..ఆ రోజు జేడీ లక్ష్మీ నారాయణ, ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌..ఇప్పుడు కొత్తగా రఘురామకృష్ణంరాజుతో పాటు మరో ఇద్దరు అర్టిస్టులను తయారు చేస్తున్నారు. వీటి ఆధారంగా మరో ఐదారు క్యారెక్టర్లను తయారు చేయించడం..కోర్టులతో చెప్పించడం ఇది ఒక వలయంగా జరుగుతోంది.
నిమ్మగడ్డ రమేష్‌ లాయర్లకు ఎంత చెల్లించాడు?..ఆ రోజు ఎందుకు రాయలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు చేశాడో ఈ పత్రికలు ఎందుకు రాయలేదు. వీళ్లు పెట్టించిన కేసుల్లో వాధించడానికి ఢిల్లీ నుంచి లాయర్లను ఎలా తెప్పించారని ఎందుకు రాయలేదు. ఇవన్నీ మేం అడగడం లేదు. సంబంధం లేని వాటిని తెరపైకి తీసుకురావడం. దొంగచాటుగా దెబ్బ కొట్టడం ఇది తప్పు. దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మధ్య మీ కుమారుడు లోకేష్‌ ట్విట్టర్‌ వీరుడు అయ్యాడు. మీ ట్రైనింగ్‌ ఎలా ఉందో అన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది. 

మా పార్టీకి, వైయస్‌ జగన్‌కు సంబంధించినంత వరకు ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో సంయమనం పాటించాలి. అగ్రాహావేశాలు పెరగడం, విభేధాలు పెంచడం సరికాదు. వాళ్లు మాట్లాడిన మాటలకు ఇంతే తీవ్రతతో మాట్లాడవచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. కేసీఆర్‌ ఎంతో ఔదార్యంతో మాట్లాడుతూ..రాయలసీమను ఆదుకునేందుకు ఎంతవరకైనా వెళ్లాలి. నేనే ముందుండి నడిపిస్తానని అన్నారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు ఎందుకు 80 వేల క్యూసెక్కులైనా తీసుకోండి అన్నారు. వరద ప్రభావం తగ్గిపోవడంతో వరద వచ్చే తక్కువ సమయంలోనే నీరు తీసుకోవాలి. దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకోకుండా మనకు కేటాయించిన మేరకు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఎన్నికలకు ముందే కర్నూలులో వైయస్‌ జగన్‌ జలదీక్ష చేశారు. దిండి, పాలమూరు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైయస్‌ జగన్‌ ఆ రోజు పోరాటం చేశారు. శ్రీశైలం జలాశయంలో 790 అడుగుల వద్దే విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుంటున్నారు. 860 అడుగులు దాడితే తప్ప ప్రవాహం ఉండదు. ఈ విషయాలు ఎవరికి చెప్పినా అర్థమవుతుంది. ఉభయ రాష్ట్రాలు బాగుండాలని కేసీఆర్‌ అనుకుంటున్నారు. అలాంటప్పుడు వరద నీటిని ఒడిసిపట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 

కేంద్రం నుంచి, తెలంగాణ నుంచి కూడా ఏపీకి సహకారం ఉంటుందని నమ్ముతున్నాం. ఈ అంశాన్ని పరిష్కరించకుండా పౌరుషంగా మాట్లాడుకోవడంతో వచ్చింది ఏమీ లేదు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ ఎప్పుడు కూడా తన స్టాండ్‌కు కట్టుబడి ఉంటారు. దానికి సహకరించనిదానికి ఎలాంటి హుంకరింపులు ఉండవు. తెలంగాణ వాళ్లు అలా అంటున్నారంటే వాళ్ల విచక్షణకే వదిలేస్తాం. మనకు రావాల్సినవి ఎట్టా రాబట్టుకోవాలో అన్న దానిపై సీఎం వైయస్‌ జగన్‌ దృష్టి కేంద్రీకరిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసమే పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top