తాడేపల్లి: మంచి చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లోనూ మద్దతు పలకాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థించారు. ఇదే నినాదంతో మున్పిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 20 నెలల కాలంలో ప్రజల్లో సీఎం వైయస్ జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలు తమ అభిమానాన్ని చాటుతూ వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ఎల్లోమీడియా నామినేషన్ల విత్‌డ్రాలు బలవంతంగా జరిగాయని దివాళాకోరుతనం, దిగజారుడుతనంతో కథనాలు రాసిందని ఖండించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను వెబ్‌సైట్‌లో ఫోటోలతో పాటు పూర్తి వివరాలు పొందుపరిచాం. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అదే దోరణీలో ఇంకొంచం మెరుగ్గా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు వస్తున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నాను. రాష్ట్రవ్యాప్తంగా 2794 డివిజన్లకు గాను 571 వార్డుల్లో అంటే 20.5 శాతం వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇది మా పార్టీకి చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఒక కానుకగా పార్టీ గుర్తుతో జరిగేఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢృఢ దీక్షతో పని చేసిన దానికి ఇది ఫలితం. 20 నెలల వైయస్ జగన్ పాలనలో మానవత కోణం ఎదైతే ఉందో..పేదల జీవితాల్లో వెలుగులు నింపే మూల సూత్రం. పేదల జీవితాల్లో వెలుగులు, కొత్త ఉద్యోగాల సృష్టి, భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఒక నిబ్బరం కలిగించి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ పటిమకు . వీటిన్నింటికి మేం పూర్తిగా హ్యాట్సాఫ్ చెబుతున్నామని ప్రజలు వాళ్ల అభిమానాన్ని చాటుకోవడం అన్నది ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణమని అందరికి తెలుసు. మొత్తం 12 కార్పొరేషన్లు, 175 మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో ఇప్పటికే మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం ఖాయమైంది. గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రకరకాల సాము గారడీలు చేసి కింద మీద పడి మాకు 30 శాతం పంచాయతీలు వచ్చాయని వాళ్ల పెద్దన్న, ఎల్లోమీడియా చెప్పుకుంది. కానీ ఇవాళ పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాబట్టి వారు కూడా ఒప్పుకోక తప్పడం లేదు. ఈ రోజు అందరూ చూసి ఉంటారు. ఈనాడు పత్రికలో యధేచ్చగా బెదిరింపులు అన్న శీర్షికతో వార్త రాశారు. ఆయన తమ్ముడు రాధాకృష్ణ ఉపసంహరణం అని ఆంధ్రజ్యోతిలో రాశారు. అందరికీ ఒక్కటే ప్రశ్న. విత్‌డ్రా అన్నది ఎవరైనా బెదిరిస్తే జరుగుతుందా?. ఈ మీడియాకు ఒక్కటే చెప్పదల్చుకున్నాం. దివాళకోరుతనం, దిగజారుడుతనంతో ఇలాంటి వార్తలు రాశారు. ఎవరైనా అభ్యర్థి విత్‌డ్రా చేసుకోవాలంటే అతనే వెళ్లాలి. లేదా అతన్ని ప్రోపొజల్ చేసిన వ్యక్తి అయినా వెళ్లి ఉపసంహరించుకోవాలి. ఇవన్నీ కూడా వీడియో రికార్డింగ్‌లు కూడా ఉంటాయి. ఎవరైనా ఒత్తిడి, బలవంతంగా చేసినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీతో దాన్ని అడ్డుకోవచ్చు. ఫోర్జరీ చేస్తే మీ అభ్యర్థి, మీ ఏజెంట్ ఉంటారు కదా? ఫిర్యాదు చేయవచ్చు. చట్టంలో ప్రతిదీ ఉంది. బాధ్యత గల మీడియా అసత్యాలు రాయడం సరైంది కాదన్నారు. అవకాశాలు లేని చోట కావాలనే అవాస్తవాలు ప్రచారం చేయడంతో వాళ్లపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. చంద్రబాబు పంచాయతీ ఎన్నికల్లో అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి చతికిలపడ్డారు. ఆయన్ను ఎవరూ నమ్మలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అస్తిపన్ను తగ్గిస్తామని, నీటి పన్ను తగ్గిస్తామని హామీలు ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి మోసం చేశారు. అధికారంలోకి రాలేమని తెలిసీ కూడా అబద్ధాలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల పాలనలోనే ఏం చేశామో చెబుతూ ఒక కరపత్రం విడుదల చేస్తునాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇది నిబద్ధతతో, నిజాయితీగా చేసే కార్యక్రమం. ఎన్నికల్లో హామీలు ఇస్తే..వాటిని వెంటనే అమలు చేయాలి. అంచెలవారీగా, వాయిదాల పద్ధతిలో రెండు చేసి మిగతావి ఎన్నికల ముందు చేసే లక్షణం వైయస్ జగన్‌కు లేదు. 20 నెలల్లో వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఒక్కో లైన్‌తో రూపొందించాం. మంచి చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లోనూ మద్దతు పలకండి..ఇదే మా నినాదం. మన పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇళ్లు, మంచినీరు సరఫరా పథకం పనులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు 29 శాతం రూరల్ ప్రజలు లబ్ధి పొందితే, 21 శాతం అర్భన్, టౌన్ ప్రజలు లబ్ధి పొందారు. అందరికీ తెలిసినవి పదే పదే ఎందుకు చెప్పుకోవాలంటే..లెక్కకు మించి ప్రతి కుటుంబంలోనూ పసిబిడ్డ నుంచి పండుటాకు వరకు వైయస్ జగన్ ఇచ్చిన పథకాలతో ఏదోరకంగా లాభం పొందారు. జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు అమలు చేశాం. విద్యకు అవసరమైన ఊతం, వైద్యానికి ఆసరాగా ప్రభుత్వం నిలిచింది. ప్రజల్లో మనోనిబ్బరం కలిగించాం. ఈ భరోసా వైయస్ జగన్ 20 నెలల్లో కల్పించారు. మున్సిపాలిటీలో వందకు వంద సీట్లు గెలుచుకుంటామనే ధీమా మాకు ఉంది. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతకు మేలు చేశారు. మద్యదళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏసాయమైనా నేరుగా లబ్ధిదారుడికి బ్యాంకు ద్వారా చేరడం ఇది చరిత్రలో తొలిసారి. బ్యాంకులు లబ్ధిదారుల డబ్బు తీసుకోకుండా అడ్డుకట్ట వేసే కార్యక్రమం చేపట్టింది. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పూర్తి సాధికారత కల్పించాం. మంత్రివర్గం నుంచే వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. దాన్నే కొనసాగిస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు. కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్‌పర్సన్ వరకు ఎక్కడా కూడా మహిళలకు తక్కువ కాకుండా అవకాశాలు కల్పించాం. ఇళ్ల పట్టాలు, అమ్మ ఒడి వంటి పథకాలు మహిళలకే అందజేస్తున్నాం. వైయస్ జగన్ ఇంత చేశారని, మరింత ఉపయోగపడేలా మంచి చేయాలంటే..ఆయన ప్రతినిధులు కిందిస్థాయిలో కూడా ఎన్నికైతే సుసాధ్యమవుతుంది. వైయస్ జగన్ సీఎం అయిన ఈ 20 నెలల పాలనలో, కరోనా సంక్షోభంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. రూ.1000 వైద్యం ఖర్చు దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా అందజేస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులకు నెలకు రూ.10 వేల చొప్పున పింఛన్ ఇస్తున్నాం. ఠంచన్‌గా 1వ తేదీ తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు గడప వద్దకు వెళ్లి ఇస్తున్నారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. 16 వేల టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా ఊర్లు వస్తున్నాయి. జగనన్న కాలనీల్లోమౌలిక సదుపాయాలు కల్పిస్తూ స్వరూపాన్ని మార్చుతున్నాం. ప్రజలు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటిని సీఎం వైయస్ జగన్ ఓ దీక్ష, తపనతో, చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. జగనన్న గోరు ముద్దలో పౌష్టికాహారం ఎలా ఉండాలి, మెనూ ఎలా ఉండాలని ఒక ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించిన దాఖలాలు ఎప్పుడైనా చూశామా? పిల్లలకు ఎలాంటి బుక్స్ ఇవ్వాలి, బట్టలు, షూ ఎలా ఉండాలని సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. గతంలో ప్రతి పథకంలో ఎలా మింగాలో ఆలోచన చేశారు. ఈ రోజు ఖర్చు చేసే ప్రతి పైసా లబ్ధిదారుడికి అందాలనే లక్ష్యంతో వైయస్ జగన్ చేస్తున్న యజ్ఞం 20 నెలలకే సత్ఫలితాలు ఇచ్చింది. గత ప్రభుత్వ బకాయిలు రూ.800 కోట్లు చెల్లించడం, చిన్న చిన్న పరిశ్రమలు నిలబెట్టారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు, నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇన్నాళ్లు మున్సిపాలిటీలకు ప్రజాప్రతినిధులు లేరు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు రాబోతున్నారు . అది కూడా మా పార్టీ నేతలే ఎన్నిక కాబోతున్నారు కాబట్టి పట్టణ, నగరాల అభివృద్ధికి కృషి చేస్తారని, ఓటర్లంతా ఎన్నికల్లో పాల్గొని మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థించారు.