ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సచివాలయం: ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొత్త పీఆర్సీలపై ఇప్పటికే జీవోలు ఇచ్చేశామని, జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆందోళన విరమించాలని కోరామని చెప్పారు. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల కార్యాచరణను వాయిదా వేయమని కోరామని చెప్పారు. సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాలకు మరోసారి చెప్పామన్నారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరామన్నారు. పీఆర్సీ సాధన కమిటీతో చర్చ పాజిటివ్‌ చర్చగానే భావిస్తున్నామన్నారు.  జీతాలు బ్యాంకు అకౌంట్లలో పడబోతున్నాయన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ చర్చిస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది. 

Back to Top