పేదల చదువు బాధ్యత మా ప్రభుత్వానిదే

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

 వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో  మౌలానా అబుల్ క‌లామ్‌ ఆజాద్  జ‌యంతి వేడుక‌లు

తాడేప‌ల్లి: పేదల చదువు బాధ్యత పూర్తిగా మా ప్రభుత్వానిదేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం జ‌నాబ్‌ మౌలానా అబుల్ క‌లామ్‌ ఆజాద్ జ‌యంతి వేడుక‌లు తాడేప‌ల్లిలోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆజాద్ చిత్ర‌ప‌టానికి సజ్జల రామకృష్ణా రెడ్డి, డిప్యూటీ సీఎం షేక్ బెపారి అంజాద్ బాషా, ప‌లువురు శాస‌న‌స‌భ్యులు, పార్టీ ముఖ్య నాయకులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని, ఎవరిపై ఎలాంటి ఒత్తిడి చేయడం లô దని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యా సంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యా సంస్థలో సంస్కరణలకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. పేదవాళ్లు చదువుకోవడం ఎలా అని లోకేష్‌ అడుగుతున్నాడని, పేదలకు రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో హోరాలు జరిగాయన్నారు. 5,10 ఏళ్లల్లోహైలీ ఎడ్యుకేటెడ్‌ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందన్నారు. 
 

Back to Top