ప్రతీ ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తాం

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
 

తాడేపల్లి: గడప గడపకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం ద్వారా ప్రతీ  ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తామని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, మంత్రులతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని  తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కార్యాచరణ నిర్దేశించారని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. వారంలో 2,3 రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. జులై 8న వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ కార్యక్రమం ఉంటుందని, ఆలోగా జిల్లా కమిటీల ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
ఉద్యోగులపై ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top