గౌత‌మ్‌రెడ్డి భౌతిక‌కాయానికి స‌జ్జ‌ల‌, కొడాలి నాని నివాళులు

హైద‌రాబాద్‌: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌లోని గౌత‌మ్‌రెడ్డి స్వ‌గృహంలో ఆయ‌న భౌతిక‌కాయానికి స‌జ్జ‌ల‌, కొడాని నాని, ఎమ్మెల్యే వంశీలు నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిని ఓదార్చారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని వారు కొనియాడారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top