తప్పును ఒప్పుకోకుండా చిల్లర రాజకీయాలేంటీ..?

దేవాలయంలో బూతులు మాట్లాడిన వ్యక్తిని ఎందుకు మందలించలేదు..?

బోసడికే అంటే బాగున్నారా అని అర్థమని చంద్రబాబు చెప్తున్నాడు

మీ తండ్రీకొడుకులు ఆ ప‌దంతోనే ప‌ల‌క‌రించుకుంటారా..?

తెలుగుదేశం పార్టీ బూతుపురాణంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి

టీడీపీ గుర్తింపు రద్దుచేయమని ఈసీని కోరతాం

గుంటూరు జనాగ్రహ దీక్షలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

గుంటూరు: యాభై ఏళ్ల వయస్సు కూడా లేని సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలందరినీ తన బిడ్డల్లా చూసుకుంటుంటే.. 70 ఏళ్లు దాటిన చంద్రబాబు చిల్లరగా వీధిస్థాయి తాగుబోతులా, బాధ్యతలేని వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అన్నట్టుగా టీడీపీ ఆఫీస్‌ దేవాలయం అయితే.. దేవాలయంలో బూతులు మాట్లాడిన వ్యక్తిని మందలించడం మానేసి.. బూతు మాట్లాడే హక్కు ఉందని ఉద్యమం, దీక్ష అంటూ లాగుతున్నాడంటే అసలు చంద్రబాబు ఉద్దేశం ఏంటీ..? అని ప్రశ్నించారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా.. గొడవలు క్రియేట్‌ చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తీరుకు, టీడీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరులో చేపట్టిన జనాగ్రహ దీక్షలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నప్పుడు ఈనాడు లాంటి ప్రధాన పత్రికలు ఏది రాస్తే అది చరిత్ర అయిపోయింది. చంద్రబాబు లాంటి మనిషి భూమి మీద ఉండటానికి కూడా అనర్హుడని ఆనాడే ఎన్టీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌కు దండవేసి.. ఆయనే మా స్ఫూర్తి అని చంద్రబాబు అనగలుగుతున్నాడంటే.. అలాంటి వ్యక్తిని మనం భరిస్తున్నామంటే అదో దౌర్భాగ్యం. 

నక్క ఆనందబాబుకు పోలీసులు నోటిసులిస్తే.. పట్టాభి అనే వ్యక్తి చంద్రబాబు దగ్గర నుంచి స్క్రిప్టు తీసుకొని ప్రెస్‌మీట్‌ పెట్టి.. ముఖ్యమంత్రిని అట్టగోలుగా, అసభ్యంగా పరుష పదజాలం వాడటంతో పాటు బోసడీకే అనే మాట నాలుగుసార్లు అన్నాడు. టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఉన్న కోట్లాది మంది అభిమానులు టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. మా పార్టీ అభిమానులు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది పక్కకు తోసోసి.. ఘోరం జరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 

కావాలనే సమస్యను క్రియేట్‌ చేసి ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నాడు. 70 ఏళ్ల వయస్సులో మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. టీడీపీ ఆఫీస్‌ దేవాలయం అయితే.. దేవాలయంలో బూతులు మాట్లాడిన వ్యక్తిని మొదటకొట్టాలి. అది వదిలేసి.. బూతులు మాట్లాడటం మా హక్కు అన్నట్టుగా దీక్షలు, ఉద్యమాలు చేస్తున్న చంద్రబాబు ఉద్దేశం ఏంటీ..? 

గంట వదలండి సర్‌ నరికేస్తాం.. చంపేస్తాం.. అని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఛండాలమైన బూతు మాట్లాడి దాన్ని సమర్థించుకుంటున్నారు. రాష్ట్రపతి పాలన అర్జెంట్‌గా పెట్టాలని కోరుకుంటున్నాడు. అధికారం లేకపోతే తట్టుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రినే నేరుగా అడగొచ్చు కదా చంద్రబాబూ..
టీడీపీకి డప్పులుకొట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు కంటే ఎక్కువగా తయారయ్యాయి. బోసడీకే అనే పదం రాజకీయాల్లో వాడాలా..? లేదా పూర్తిగా నిషేధించి.. అలా మాట్లాడిన వారిని సాంఘిక బహిష్కరణ చేయాలా అనేది చర్చ జరగాలి. ప్రజలంతా టీడీపీ బూతుపురాణంపై ఆలోచనలు చేయాలి. 

బోసడికే అంటే బాగున్నారా అని అర్థమని చంద్రబాబు చెప్తున్నాడు. అమిషాను కలిసినప్పుడు అదే మాట అంటారా..? మోడీని కలిసినప్పుడు అంటారా..? పొద్దున్నే మీ కొడుకును పట్టుకొని లోకేష్‌ బోసడీకే అంటే.. నాన్న బోసడీకే అనుకుంటారా..? బోసడీకే అనడం తప్పుకాదా..? నిన్నటి రోజున ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. చెప్పుకోలేక బాధతో అతన్ని అన్న మాట చెప్పుకుంటే.. ఆ మాటను ఈనాడు పత్రికలో ఎందుకు రాయలేదు. ఆ మాట అన్నవాడిని, దీక్షకు కూర్చున్నవాడిని ప్రజలు అసహ్యంచుకుంటారని రాయలేదా..? రామోజీరావు, రాధాకృష్ణను పట్టుకొని బోసడీకే అంటే పడతారా..? దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. 

బూతులు తప్ప మరేమీ తెలియని తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌ను మా ఎంపీలు వెళ్లి కలుస్తారు. చంద్రబాబు ఇకనైనా నా దొంగ దీక్షలు, నా ఆటలు సాగవని గ్రహించి.. తప్పును ఒప్పుకోవాలని భావించి.. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని అంటే కొంతైనా పాపవిముక్తి వస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ను, రాష్ట్ర ప్రజలను క్షమాపణలు కోరాలి. కోరనంత వరకు చంద్రబాబు లాంటి ∙నిక్రుష్టుడు, చరిత్ర హీనుడు ఎవరూ ఉండరనేది మరోసారి రుజువవుతుంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  

 

తాజా వీడియోలు

Back to Top