రాష్ట్ర భవిష్యత్తును మేలిమలుపు తిప్పిన జననేత పాదయాత్ర 

‘ప్రజా సంకల్పయాత్ర’ ప్రారంభించి నవంబర్‌ 6కి మూడేళ్లు

ప్రత్యేక పోస్టర్, సీడీని విడుదల చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

నవంబర్‌ 6న రాష్ట్ర వ్యాప్తంగా భారీ కార్యక్రమాలు

పార్టీ శ్రేణులతో పాటు, ప్రజలంతా పాల్గొనాలని పిలుపు

తాడేపల్లి: ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్‌ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభానికి మూడేళ్ల సందర్భంగా ప్రత్యేక పోస్టర్, సీడీని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా రాష్ట్ర భవిష్యత్తును మేలిమలుపు తిప్పి, సంక్షేమంలో, అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్తున్నారు. నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబడ్డారన్నారు. ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపిన అరుదైన నాయకుడిగా వైయస్‌ జగన్‌ కనిపిస్తున్నారని చెప్పారు. ఇలాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్‌ కలిగి ఉండటం అదృష్టంగా ప్రజలంతా భావిస్తున్నారన్నారు. 

2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ మొదలుపెట్టిన పాదయాత్ర ఋతువులన్నీ దాటుకుంటూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 3648 కిలోమీటర్లు సాగిందన్నారు. బరువెక్కిన గుండెలకు నేను ఉన్నానని ధైర్యం ఇస్తూ ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ముగించారన్నారు. పాదయాత్ర ఎంత బ్రహ్మండంగా సాగిందో.. ఎంత ఉత్సాహంగో సాధిందో.. అలాగే ప్రజా సంకల్పయాత్ర ప్రారంభానికి మూడేళ్లవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులతో పాటు, ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నానని తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top