పోలీసులకు శానిటైజర్లు, మాస్కుల పంపిణీ 

గుంటూరు : కరోనా వైరస్‌ నేపథ్యంలో పోలీసులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. ప్రపంచానికి కష్టకాలం వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనాకు పూర్తి స్థాయి మందు రాలేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మనకున్న వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామన్నారు. మిగిలిన రాష్ట్రాలకంటే మన దగ్గర కొంత మెరుగ్గా ఉందని, పోలీసులు సైనికుల్లాగ పనిచేస్తున్నారని సజ్జల  పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top