వికేంద్రీకరణ జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

సీఎం వైయస్‌ జగన్‌ ఏడు నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు

ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారు?

గ్రాఫిక్స్‌తో ప్రజలను చంద్రబాబు మోసం చేశారు

ఏపీకి ఐదేళ్లలో చంద్రబాబు రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేశారు

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి

ఐదేళ్ల పాలనలో అమరావతిలో బాబు చేసింది ఏమీ లేదు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా చంద్రబాబు వ్యవహరించారు

అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేకపోయారు

ఏపీని సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

నరసరావుపేట: రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైయస్‌ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అన్ని కమిటీల రిపోర్టులు కూడా  ఇవే చెబుతున్నాయన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఈ పని చేసి ఉంటే వైయస్‌ జగన్‌కు ఇలాంటి ఆలోచన వచ్చేది కాదన్నారు. కేవలం తన భూముల విలువ పెంచుకునేలా చంద్రబాబు రియల్‌  ఎస్టేట్‌ వ్యాపారం చేశారని విమర్శించారు. వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
సంపూర్ణంగా జనాధరణ పొంది, అన్ని వర్గాల ఆశిస్సులతో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ ఏడు నెలల్లో తీసుకువచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు రాష్ట్రాన్ని దశ దిశను మార్చుతున్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన చర్యపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణపై చర్చ జరుగుతుంది. కొస ప్రాణాలతో ఉన్న రాజకీయ పార్టీ అధినేత చంద్రబాబు ఒక ప్రాంతంలో ఉద్యమం మొదలు పెట్టడం, దాని గురించి ఒకటి రెండు మీడియాలు ఊదరగొట్టడంతో ప్రజలకు నిజాలు చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2014 రాష్ట్ర చరిత్రలో నిలబడి పోతుంది. మనకు సంబంధంలోని ద్రోహపూరిత చర్యతో అవశేష ఆంధ్రప్రదేశ్‌ వచ్చింది. వైయస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డ వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తున్నారన్న సమాచారంతో చంద్రబాబు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. ఆ రోజు వైయస్‌ జగన్‌ సీఎం అయి ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా ముందు ఉండేది. కానీ ఆ చారిత్రక అవకాశం టీడీపీకి వచ్చింది. దాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు. బహుష అవసాన దశకు వచ్చాం..ఎక్కువ కాలం ఉండమని ఇష్టానుసారంగా వ్యవహరించారు. అరచేతిలో వైకుంఠం చూపారు. అమరావతిలో తప్పుడు ప్రచారం చేసి రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. తెలిసి తెలిసి ఘోరమైన చారిత్రక ద్రోహం రాష్ట్రానికి చేశారు. ఆయన రాజధాని అని పేరు పెట్టిన అమరావతి. అమరావతి రాజధానికి సరైన ప్రాంతం కాదని ఎవరైనా చెబుతారు. అలాంటిది తెలిసీ కూడా ఎక్కడో పొలాల్లో మధ్యలో పునాది వేసి నాలుగేళ్ల పాటు తాత్కాలిక భవనంలో పాలన సాగించారు. గత ఐదేళ్ల కాలంలో రాజధాని కట్టొద్దని ఎవరు అనలేదు. మన రాష్ట్రం విడిపోయే సమయానికి రూ.90 వేల కోట్లు అప్పు ఉండేది. దాన్ని చంద్రబాబు నికరంగా బకాయిలు లెక్కలు వేస్తే రూ.3.40 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆయనే రాజధానికి లక్ష కోట్లు అవసరం అన్నారు. ఆ డబ్బులు రాజధానికి వెచ్చించినా సుందర రాజధాని రెడీ అయ్యేది. ప్రభుత్వ భూమి అన్నారు..కానీ ఆయన ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా పూలింగ్‌ పేరుతో భూములు తన బినామీలకు, అనుయాయులకు కట్టబెట్టారు.

శాశ్వత భవనాలు నిర్మించి ఉంటే నిన్నటి ఎన్నికల్లో తీర్పు వేరే విధంగా వచ్చేదేమో?. భూములు సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ చంద్రబాబు చారిత్రక ద్రోహం చేశారు. మోదీతో శంకుస్థాపన చేయించింది ఒక చోట..తాత్కాలిక భవనం నిర్మించింది ఒకచోట..పర్మినెంట్‌ బిల్డింగ్‌లు కట్టించేది మరోచోట..అందరికి తెలుసు. ప్రజల వద్ద నుంచి భయపెట్టి, నయానో, భయానో భూములు సేకరించారు. చంద్రబాబు భూములకు విలువ పెంచుకునేందుకు రాజధాని నిర్మించలేకపోయారు. మా ప్రభుత్వం వచ్చాక ఇప్పటి దాకా లెక్కలు తీస్తే 4060 ఎకరాలు చంద్రబాబు బినామీల పేరుతో కొనుగోలు చేయించారు. 28 వేల మంది రైతులు, 34 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చారట. అందులో లెక్కలు తీస్తే 1400 మంది రైతులు రాజధాని ప్రకటనకు ముందు, ప్రకటించిన కొద్ది రోజుల తరువాత భూములు కొనుగోలు చేశారు. వీరంతా అక్కడ ఉండేవారు కాదు. దళితుల భూములు తీసుకున్నారు. అసైన్డ్‌ భూములు తీసుకున్నారు. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. తన భూములకు రేటు వచ్చేందుకు కాలయాపన చేశారు. విజయవాడ- గుంటూరు మధ్య చంద్రబాబు రాజధాని ఎందుకు నిర్మించి ఉండకూడదు.

రాష్ట్రం మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఆరోజే వికేంద్రీకరణ మొదలుపెట్టేవారు. నిజంగా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే పక్కా భవనాలు నిర్మించేవారు. ఈ రెండు చేయలేదు. ఐదేళ్ల వరకు డిజైన్లు ఫైనల్‌ చేయలేదు. ఈ రోజు వచ్చి ఇది అన్యాయం..అందరూ ఖండించాలి అంటూ జోలె పట్టుకొని తిరుగుతున్నారు. చంద్రబాబు ఐదేళ్లు కరకట్టపై నివాసం చేశారు. ఆయన ఇంటికి వెళ్లే దారి వన్‌ వే..ఆ రూట్లో వైయస్‌ జగన్‌ను కూడా అనుమతించలేదు. ఎదురుగా మరో వాహనం వస్తే కాల్వలో పడుతుంది. క్యాపిటల్‌, గ్రీన్‌ సిటీ అంటూ అమరావతిని గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేశారు. వరదలు వస్తే చాలు మొత్తం మునిగిపోతుంది. వంద అడుగుల పునాది వేస్తే తప్ప ఇళ్లు నిలబడటం లేదు. అయినా సరే అమరావతిలో చంద్రబాబు నిర్మాణాలు చేసి ఉంటే ఇప్పుడు వైయస్‌ జగన్‌కు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది?  వేరే చోటికి వెళ్లాలనే ఆలోచన వచ్చేది కాదు. ఎంత సేపు చంద్రబాబు తన భూములకు విలువ పెంచుకునే ప్రయత్నం చేశారు. గ్రీన్‌ జోన్‌ పేరుతో రైతులను దెబ్బ కొట్టాడు. మోసం, ద్రోహం అన్నది క్లియర్‌గా  కనిపిస్తుంది.
పరిపాలన అన్నది ప్రతి గడపకు చేరాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యం.

గ్రామ సచివాలయం వ్యవస్థ, గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పై నుంచి కింద వరకు ప్రక్షాళన చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు తొలగించేందుకు అధికార వికేంద్రీకరణపై ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో కొత్తగా పునాదులు వేసి విజయవంతం అయినవి చాలా తక్కువగా ఉన్నాయి. 30 సంవత్సరాల సమయం పడుతుంది. 1980 వరకు హైదరాబాద్‌ అంటే ఎవరికి తెలిసేది కాదు..ఇప్పడు అందరికి తెలుసు. బంధువులు కూడా అక్కడ ఉంటున్నారు.  హైదరాబాద్‌ ఇప్పటికీ అభివృద్ధి చెందుతోంది. సినిమా పరిశ్రమ ఇప్పటికీ హైదరాబాద్‌కు పూర్తిస్థాయిలో రాలేదు. అభివృద్ధి వేగవంతం చేయాలంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమే బేటర్‌. మనకు ఉన్న ఏకైక సిటీ వైజాగ్‌ మాత్రమే. ఐదు, పదేళ్లలో ఇంటర్‌ నేషనల్ సిటీలతో ఏపీ పోటి పడే అవకాశం ఉంటుంది. ఇదే కమిటీలు కూడా చెప్పాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో వికేంద్రీకరణ దిశగా రాష్ట్రాన్ని మళ్లించాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. అయినా కూడా కుటుంబ పెద్దగా, రాష్ట్రానికి పెద్దగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. మా బాగు కోసమే వైయస్‌ జగన్‌ తీసుకున్నారన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. చంద్రబాబు మోసం మాత్రమే చేయగలరని ప్రజలు అనుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణతో ఎవరికి నష్టం కలుగదు. ఎక్కడక్కడ సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు అవసరమో గుర్తించారు. నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెడుతున్నాం. పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ఉద్యమం చేపట్టారు. సంజాయిషి ఇవ్వాల్సిన వ్యక్తులే డిమాండు చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటిని ఎలాంటి సమస్యలు లేకుండా రాష్ట్రమంతా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. వైయస్‌ జగన్‌ ప్రయత్నాల్లో ప్రజలు అండగా నిలవాలి. అందరూ వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. 

Back to Top