వైయస్‌ జగన్‌ వాసిరెడ్డి పద్మను స్టీల్‌ లేడి అని పిలిచేవారు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వాసిరెడ్డిపద్మను స్టీల్‌ లేడి అని పిలిచేవారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆమెను తన  ఇంటి ఆడపడుచులాగా సీఎం చూసుకున్నారని చెప్పారు. వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో వాసిరెడ్డి పద్మ పాత్ర అసాధారణమైనదన్నారు.  వైయస్‌ జగన్‌ ఆలోచనకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. వైయస్‌ జగన్‌ ఆమెను స్టీల్‌ లేడి అని పిలుస్తుంటారని చెప్పారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమన్నారు. మహిళల సమస్యలపై ఆమె ఫోకస్‌గా వ్యవహరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సాధికారికత దిశగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చట్టానికి ఆమోదం తెలపడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు.  వచ్చే ఐదేళ్లలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా  వైయస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా వాసిరెడ్డి పద్మ పని చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Back to Top