ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారు..

 ఓట్ల తొలగింపు అనైతిక చర్య..

వైయస్‌ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి..

వైయస్‌ఆర్‌ జిల్లా:రాజ్యాంగ సూత్రాలను చంద్రబాబు తుంగలో తొక్కారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దోషిగా నిలబడ్డారన్నారు.వచ్చే ఎన్నికల్లో ధర్మమార్గంలో తాను చేసింది చెప్పుకునే స్థితి బాబుకు లేదన్నారు.బోనులో నిలబడాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైందన్నారు.ఏడాది నుంచి ఓట్ల తొలగింపు వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు.ఓట్లను తొలగించడం,ఓట్లు కొనడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారన్నారు.సర్వేల పేరుతో బూత్‌స్థాయిలో కొన్ని ఓట్లను టార్గెట్‌ చేసి తొలగిస్తున్నారన్నారు.

నకిలీ సర్వేలపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు.పైగా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై ఎదురుకేసులు పెడుతున్నారన్నారు.రాష్ట్రంలో 55 లక్షల ఓట్లను తొలగించారన్నారు.అనేక సార్లు ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.ఓట్ల తొలగింపుపై కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నామని తెలిపారు.ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.నంద్యాలలోనూ ఇదే తీరును చంద్రబాబు అవలంభించారన్నారు.అత్యంత హీనస్థితిలోకి చంద్రబాబు వెళ్ళిపోయారన్నారు.ఎన్నికలంటే టీడీపీ భయపడుతోంది కాబట్టే..ఇటువంటి అనైతిక చర్యలకు సర్వేల పేరుతో ఎవరు వచ్చిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top