వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతాం

చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

 బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్ర‌బాబుకు లేదు

జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు ప్రచారం చేయించారు..ఇప్పుడు టీడీపీలో ఎలా చేర్చుకుంటున్నారు

సీఎం వైయ‌స్ జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారు

తాడేప‌ల్లిలో వడ్డెర ఆత్మీయ సమావేశం

తాడేపల్లి: వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతామ‌ని, చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా? అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని  దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  జరిగిన వడ్డెర ఆత్మీయ సమావేశంలో సజ్జలతో పాటు ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, వడ్డెర కారొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతి, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారని, గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటోందన్నారు. జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు? అని నిల‌దీశారు. వైయ‌స్ జ‌గ‌న్‌ పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతున్నారు. పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడుతో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు. వైయ‌స్ జగన్ చేసినవన్ని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. బరితెగించేలా చంద్రబాబు ప్రవర్తన ఉంద‌ని సజ్జల ధ్వజమెత్తారు.

ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ఏమి చేశారు?. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్‌ని చంద్రబాబు తయారు చేశారు. చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలు చేశారు. రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు. ఇంక చాలు అంటూ ప్రజలు 2019లో  చంద్రబాబుని సాగనంపారు. 23 ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలని చూసినా జగన్ నిలబడ్డారు. సీఎం వైయ‌స్ జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారు. అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారు. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు.. చట్టం చేసి మరీ వైయ‌స్ జగన్ చర్యలు చేపట్టారు. వైయ‌స్ జగన్‌కి ఉన్న నిబద్ధత మరొకరు కి లేదు.. వైయ‌స్‌ జగన్ ఒక రిఫార్మర్‌గా ఆలోచనలు చేశార‌ని సజ్జల పేర్కొన్నారు.

 బీసీల్లో వడ్డెరలకు పూర్తి న్యాయం జరుగుతుంది. చంద్రబాబు అనుకూలంగా సర్వేలు లేవు. అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నార‌ని సజ్జల మండిపడ్డారు.

Back to Top