సీఎం వైయ‌స్ జగన్‌ కృషితో మహిళా సాధికారత

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పలు అవకాశాలు కల్పిస్తూ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహిళలకు అన్ని రకాలుగా అత్యంత ఉన్నత స్థానం కల్పించింది వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. సీఎం వైయ‌స్ జగన్‌ రెండున్నరేళ్లుగా మహిళా సాధికారత కోసం వెల్లువలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు.

సీఎం వైయ‌స్ జగన్‌ తమకు దేవుడిచ్చిన అన్న అని ప్రతి మహిళా చెబుతోందన్నారు. చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తే సీఎం వైయ‌స్ జగన్‌ అండగా నిలబడ్డారన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ప్రతి పేద ఇంట్లో పొయ్యి వెలిగిందంటే సీఎం జగన్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమన్నారు. వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయంతో ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సజ్జల మాట్లాడారు.

మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదిగేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సజ్జల తెలిపారు. ఇళ్లు లేని పేద కుటుంబాల్లో 30 లక్షల మంది మహిళలకు అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇళ్ల పట్టాలిచ్చి సీఎం వైయ‌స్ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని నింపారని చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top