జగనన్న కాలనీని పరిశీలించిన సజ్జల రామకృష్ణారెడ్డి

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్మిస్తున్న వైయ‌స్ఆర్ జగనన్న కాలనీని  వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. తొలివిడతలో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న మహిళా లబ్ధిదారులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. దశాబ్దాల కాలం నాటి తమ సొంతింటి  కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేద మహిళా లబ్ధిదారులు తెలిపారు. అనంతరం వెంకటగిరిలో వైఎస్సార్ సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఇంట్లో శుభకార్యానికి సజ్జల రామకృష్ణారెడ్డి హజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top