బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్దపీట

బీసీలను ముందు వరుసలో నిలిపేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పార్టీ కేంద్ర కార్యాలయంలో పూలే వర్ధంతి కార్యక్రమం

హాజ‌రైన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయ‌కులు

తాడేపల్లి: బలహీనవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాసులుగా మారుస్తానని మాటిచ్చిన సీఎం.. 56 బీసీ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సమసమాజం నిర్మాణం కోసం సీఎం అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. వచ్చే మూడేళ్లలో కూడా బీసీలను ముందు వరుసలో నిలుపుతామన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరాపు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్‌ కృష్ణ, గుమ్మనూరు జయరామ్, బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేష్, కాపు రామచంద్రారెడ్డి, విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరమిరెడ్డి, చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, గుంటూరు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఏసురత్నం, రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణమూర్తి, ఈదా రాజాశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Back to Top