బాబు బర్త్‌డే వేడుకలైతే కరోనా రాదా?

సజ్జల రామకృష్ణా రెడ్డి

తాడేపల్లి: కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు టీడీపీ వాళ్లు చేసింది ఏంటి? దాని వల్ల కరోనా రాదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.  కరోనా మహమ్మారి కారణంగా పెద్ద మానవ సంక్షోభమే సంభవించిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.  కరోనా విభృంజిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

వైయస్‌ఆర్‌సీపీ సేవా కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు, కరోనా లాంటి కష్టకాలంలో ఇలాంటి ఆరోపణలు తగవని సజ్జల హితవు పలికారు. 
 

Back to Top