ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామ‌కృష్ణారెడ్డి 

అమ‌రావ‌తి : వైయస్‌ఆర్‌సీపీ  సీనియర్‌ నేత, పార్టీ  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)గా నియమితులయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కేబినెట్‌ ర్యాంకులో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన (పొలిటికల్‌) శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా మంగళవారం జీవో జారీ చేశారు. సౌమ్యుడిగా, మృధుస్వబావిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీలో కీలక భూమిక నిర్వహిస్తున్నారు.ఆవిర్భావంనుంచి ముఖ్య నేతల్లో ఒకరిగా పలు బాధ్యతలు చేపట్టారు. గత పదేళ్లుగా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సీనియర్‌నేతగా, అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వివిధ రూపాల్లో విశేష సేవలు అందించారు. ప్రముఖ పాత్రికేయునిగా, సీనియర్‌ రాజకీయ నేతగా ప్రజా వ్యవహరాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. అందుకే ఆయన్ను కేబినెట్‌ హోదాతో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా నియమించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top