తాడికొండ: తాడికొండ సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. పట్టణ వీధులన్నీ జై జగన్ నినాదాలతో మార్మోగాయి. సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. జగనన్న నాలుగున్నరేళ్లలో సాధించిన విజయాలు, సాధికారతను నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, కిలారి రోశయ్య, ముస్తఫా, నంబూరు శంకర్రావు, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. *మంత్రి ఆదిమూలపు సురేష్* * సామాజిక న్యాయం నినాదం కాదు, అది మా జగనన్న ప్రభుత్వ విధానం. * ఈరోజు అన్ని రంగాల్లో బడుగు, బలహీన వర్గాలను అందలం ఎక్కించి పల్లకీలో పెట్టిన జగనన్న. * గుడుల్లో ధర్మకర్తలుగా బడుగు బలహీనవర్గాలకు అవకాశం కల్పించారు. * ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగ, రెల్లి మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకొనే చంద్రబాబును మళ్లీ రానివ్వకూడదు. * రాష్ట్రంలో ఒక ఆలోచన, భావజాలంతో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేస్తున్న జగనన్న. * 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే కారణం జగనన్న. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి. * మీకు మేలు జరిగితేనే ఓటేయాలని ధైర్యంగా అడిగే నాయకుడు జగనన్న మాత్రమే. * జగనన్న ముద్రించిన నాణేలం మేము. 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా చెల్లుబాటు అవుతామని రాష్ట్ర ప్రజలు 2024లో నిరూపించబోతున్నారు. * మన పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్లి ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. పవన్ అలా మాట్లాడగలడా? * తాడికొండ నియోజకవర్గం నడిబొడ్డున దళితులు ఉండరాదని చెప్పిన టీడీపీ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి. * ఈ ప్రాంతంలో 50 వేల ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఘనత జగనన్నది. *మంత్రి జోగి రమేష్* * కుప్పంలో గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వలేని బాబు ఎయిర్ పోర్టు ఏం కట్టిస్తాడని అక్కడివాళ్లే అడుగుతున్నారు. * మన జగనన్న అక్కడి ప్రజలకు దాహార్తిని తీర్చాడు. కుప్పంలో ఆర్డీవో ఆఫీసు పెట్టించాడు. * కుప్పంలో చంద్రబాబు ఓటమి గ్యారెంటీ. * ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టడంలో అవినీతి జరిగిందంటూ పవన్.. ప్రధానికి లేఖ రాశాడు. రేపు 11 గంటలకు నువ్వు చెప్పిన ప్రతి విషయం మీదా మీడియాతో మాట్లాడుతా. వచ్చే దమ్ము, ధైర్యం ఉందా? * ప్యాకేజీల కోసం చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొనేందుకు లెటర్లు రాసిన పవన్. * దేశంలోని 28 రాష్ట్రాల్లో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక సీఎం జగనన్న మాత్రమే. * 25 మంది మంత్రులుంటే 17 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. * దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని, బీసీల తోకలు కత్తిరిస్తానని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఎక్కడ.. బీసీలను బ్యాక్‌బోన్‌గా చేసిన జగనన్న ఎక్కడ? * 9 రాజ్యసభ సీట్లలో నాలుగు బలహీనవర్గాలకు ఇచ్చిన జగనన్న. * వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని.. కనకమేడల రవీంద్రకు అమ్ముకున్న చంద్రబాబు. * మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన జగనన్న. * జిల్లా పరిషత్ చైర్మన్లుగా జనరల్ స్థానాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూర్చోబెట్టిన జగనన్నను ఏమనాలి? పూలే, అంబేద్కర్, భగత్ సింగ్ అనాలా? * చంద్రబాబు.. పవన్, బీజేపీ, కాంగ్రెస్.. అందరితో కలిసి రావాలి. పక్కనే ఉన్న కృష్ణా నదిలో కలిపేద్దాం. * చంద్రబాబుకే గ్యారెంటీ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరికీ గ్యారెంటీ మన జగనన్న మాత్రమే. *ఎంపీ నందిగం సురేష్* * చంద్రబాబు దళితులను హోంమంత్రిగా చేశారా? * ఓట్లు వేయడమే కాదు, సీట్లు కూడా ఇచ్చి, గెలిపించి హోం మినిస్టర్లుగా చేసిన ఘనత జగనన్నది. * రాజకీయంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు గౌరవం పెరిగేలా పదవులొచ్చాయంటే జగనన్న గొప్పతనం. * తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచితే రేవంత్ రెడ్డి గురించి ఈనాడు, టీవీ5, ఎల్లో మీడియా గొప్పగా రాశారు. * కానీ జగనన్న రాష్ట్రంలో రూ.25 లక్షలు చేస్తే ఎల్లో మీడియా దాని గురించి మాట్లాడదు. * రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను ఎవరినీ చంద్రబాబు ఉండనివ్వడు. * కుల రాజధాని పెట్టుకొని.. ఎస్సీలు, ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇక్కడ ఉంటే మురికి కూపాలుగా మారుతాయని కోర్టుకు వెళ్లాడు. * ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నా పక్కనే ఉండాలని భావించిన జగనన్న. * తెలంగాణలో దళిత బిడ్డకు వచ్చిన ఓట్లు కూడా పవన్‌కు రాలేదు. * ఎస్సీలపైన కేసులు పెట్టి, పొలాలు తగలబెట్టించారని చంద్రబాబు జైల్లో కూర్చోబెడితే జగనన్న ఏకంగా పార్లమెంటులో కూర్చోబెట్టారు. * పదో తరగతి చదివినా నేను గ్రీన్ ఇంకుతో సంతకం పెట్టేలా చేసిన ఘనత జగనన్నది. * రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయితే భూముల ధరలు పెరుగుతాయి. * మనకు రెండెకరాలుంటే మన బిడ్డలకు సమానంగా పంచుతాం. జగనన్నను రాష్ట్రమంతా గెలిపిస్తే అందరికీ న్యాయం చేయాలి కదా? * మరో 20 సంవత్సరాలు జగనన్న సీఎంగా ఉంటే మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చి ఉన్నత స్థాయికి వెళ్తాం. *ఎమ్మెల్యే సుచరిత* * అంబేద్కర్ చెప్పిన విధంగా సీఎం జగన్ పాలన చేపట్టిన వెంటనే సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారు. * 2006లో జెడ్పీటీసీగా ఫిరంగిపురం మండలం నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. * వైయస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వెళ్లాను. * వైయస్సార్ మరణానంతరం జగనన్న వెంట నడుస్తూ నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో వైయస్సార్ సీపీ అభ్యర్థిగా గెలిచాను. * నేనేంటి.. హోంమంత్రి కావడం ఏంటి అనుకొనేదాన్ని. కానీ దాన్ని నిజం చేసి చూపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగనన్న. * నా భర్త ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ముంబైలో చేస్తుండగా, అక్కడ పేపర్‌లో వార్త రాశారు. ఇక్కడ పని చేస్తున్న అధికారి భార్య ఏపీలో హోంమంత్రి అయ్యిందని రాశారు. * ఏపీ చరిత్రలో నాకు జగనన్న ఒక పేజీ ఇచ్చేశారు. తొలి దళిత హోంమంత్రిగా నా పేరు ఉంటుంది. ఇంతకంటే రాజకీయాల్లో కోరుకొనేది లేదని జగనన్నతో చెప్పాను. * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం అంటే రెండు పదవులివ్వడమే చాలా కష్టం. * మంత్రివర్గంలో మొట్ట మొదటే ఆదిమూలపు సురేష్‌కు విద్యా శాఖ, మళ్లీ ఇప్పుడు మున్సిపల్ శాఖ ఇచ్చిన ఘనత జగనన్నది. * పాలనలో మార్పులు చూస్తున్నాం. వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తెచ్చి సామాజిక న్యాయం చేస్తున్న జగనన్న. * బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గుర్తించి పదవులిచ్చింది జగనన్న మాత్రమే. * తాడికొండ నియోజకవర్గంలో లక్ష మందికి పైచిలుకు రూ.700 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసిన జగనన్న. * సచివాలయ వ్యవస్థతో 1.50 లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన చరిత్ర జగనన్నది.