అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన జగనన్న 

వార్డుమెంబర్‌ నుంచి ఉపముఖ్యమంత్రి దాకా మైనార్టీలకు పదవులు_డిప్యూటీ సీఎం అంజాద్ బాషా 

 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కులు కాపాడిన సీఎం జగన్‌: మంత్రి మేరుగ నాగార్జున 

 సామాజిక ధర్మం పాటించిన ఒకే ఒక్క మగాడు జగనన్న: మంత్రి జోగి రమేష్ 

 ప్రజల వద్దకే పాలన తెచ్చిన ఘనత జగనన్నది: ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు 

 ఎన్టీఆర్ జిల్లా,నందిగామ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర 

నందిగామ: సామాజిక సాధికార యాత్రతో నందిగామ దద్దరిల్లింది. వేలాది మంది జనం మధ్య నేతలకు సాదర స్వాగతం లభించింది. జై జగన్‌ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. నాలుగున్నరేళ్లలో జగనన్న అండతో తాము సాధించిన సామాజిక సాధికారతను నేతలు తమ ప్రసంగాల్లో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా,  మంత్రులు జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాస్‌, కైలే అనిల్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్‌, జూపూడి ప్రభాకర్ రావు, కుంబా రవిబాబు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. 

 డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ....

* దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సామాజిక సాధికారత ఒక నినాదంగానే ఉంది. 
* రాష్ట్రంలో జగనన్న నేతృత్వంలోని ప్రభుత్వంలో సామాజిక సాధికారత ఒక నినాదం కాదు, రాష్ట్ర ప్రభుత్వ నినాదం అని చేసి చూపించారు. 
* దానికి నిదర్శనం ఇవాళ ఈ వేదికపై ఉన్న నేతలే.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన ఎంతోమంది నాయకులకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌.
* చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను మోసం చేశాడు. పూర్తిగా అణగదొక్కాడు.
* జగనన్న ప్రభుత్వంలో అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను చేయి పట్టుకొని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారు. 
* మంత్రివర్గంలో 25 మంది ఉంటే 70 శాతం అంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు.
* ఐదుగురు ఉపముఖ్యమంత్రులుంటే నలుగురు బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలే.
* మైనార్టీ వర్గానికి చెందిన నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన జగనన్న.
* తన మొదటి కేబినెట్‌లో అవకాశం కల్పించి రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. 
* చంద్రబాబు కేబినెట్‌లో ఒక్క మైనార్టీ మంత్రి లేడు. ఎన్నికల కోసం మూడు నెలల ముందు ఒకరికి మంత్రి ఇచ్చాడు.
* జగనన్న ప్రభుత్వంలో మైనార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు.
* జఖియా ఖానమ్‌ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా చేసిన చరిత్ర జగనన్నది.
* మైనార్టీల సంక్షేమం కోసం చంద్రబాబు హయాంలో రూ.2,650 కోట్లే ఖర్చు చేస్తే జగనన్న ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో రూ.23,175 కోట్లు ఖర్చు చేశారు. 
* 12 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్‌ పదవులు మైనార్టీలకు ఇచ్చారు. 100కు పైగా రాష్ట్ర స్థాయి డైరెక్టర్లుగా ఇచ్చారు.
* వార్డు మెంబర్‌ నుంచి ఉపముఖ్యమంత్రి దాకా మైనార్టీలను చేయి పట్టుకొని నడిపిస్తున్న వ్యక్తి జగనన్న.
* ఏకంగా చట్టాన్నిచేసి నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత జగనన్నది.
* చంద్రబాబుకు 75ఏళ్లు. మనకు మన పిల్లల భవిష్యత్తుకు ఆయన గ్యారెంటీ అని చెబుతున్నారు. మన చెవిలో పూలు పెడుతున్నారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ....

* అంబేద్కర్‌, సాహూ మహరాజ్‌, పెరియార్‌ రామస్వామి, బాబూ జగ్జీవన్‌ రామ్‌, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ లాంటి మహనీయులు సామాజిక విప్లవం రావాలని ఉద్యమాలు చేశారు.
* దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ సామాజిక విప్లవం అంటే ఏంటో రుచి చూపలేదు.
* ప్రప్రథమంగా ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాతే సామాజిక విప్లవం జరుగుతోంది.
* అసమానతలు తొలగి ఈ కులాల అభ్యున్నతి పెరిగింది.
* ఏపీ చరిత్రలో ఎస్సీలను తేలికగా చూశారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు.. అన్నది ఎవరూ మర్చిపోవద్దు.
* బీసీల తోకలు కత్తిరిస్తానన్నమాటలు మరవద్దు.
* బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్యాస్ట్‌గా తీసుకొచ్చిన జగనన్న.
* ఏపీలో బీసీలు జడ్జీలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారు.
* ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారు.
* రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చారు.
* అణగారిన వర్గాల అభ్యున్నతి పెరిగింది. 
* ధైర్యంగా తెల్లబట్టలు వేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నాయకులుగా ఉండటానికి కారణం జగనన్న పనితీరు.
* చంద్రబాబు ఎస్సీ ఎస్టీలను మింగేశాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. చట్టాలను చుట్టాలుగా మార్చుకున్నాడు.
* మన హక్కులు కాపాడే జగనన్నను మనం కాపాడుకోవాలి. 

మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ...

* దేశంలో 28 రాష్ట్రాలుంటే సామాజిక న్యాయం, సామాజిక ధర్మం పాటించిన ఏకైక సీఎం జగనన్న.
* ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఒకచోటకు వచ్చి మా లీడర్‌ జగనన్న అని కదం తొక్కుతున్నారు. 
* కేబినెట్‌లో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి జగనన్న సామాజికధర్మం పాటించారు. 
* 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఏనాడైనా చేశాడా?
* నలుగురు బీసీలను జగనన్న రాజ్యసభకు పంపారు.
* రాజ్యసభ సీటు ఇస్తానని వర్ల రామయ్యను మోసం చేసి కనకమేడల రవీంద్రకు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు 
* బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని జగనన్న స్పూర్తిగా తీసుకున్నారు.
* జ్యోతిరావుపూలే లాగా జగనన్న ఆలోచన చేశాడు.
* జగనన్నను ఎదుర్కోవాలంటే చంద్రబాబు, టీడీపీ చాలదంట. పొత్తులు కావాలంట. 
* నువ్వు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరితో పొర్లాడినా 2024లో వైయస్సార్‌సీపీ జెండా రెపరెపలాడబోతోంది.
* బీసీలకు పెద్దపీట వేసినందుకు, మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు, అగ్రవర్ణ పేదలను ఆదుకుంటున్నందుకు జగనన్నను ఓడిస్తారా?
* చంద్రబాబు, పవన్‌ వగైరా ఎవరైనా కట్ట కలిసి వచ్చినా కృష్ణా నదిలో కలిపేయడం ఖాయం. 
* రేపు రాబోయే ఎన్నికలు పేద వాడికి, పెత్తందార్లకు జరిగే యుద్ధం. 
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలంతా జగనన్నతో అడుగులు వేద్దాం. 

ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ...

* సామాజిక సాధికారత.. ఇది ఏపీలో ఉన్న ప్రతి పేదవాడి సాధికార యాత్ర.
* విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, గృహ నిర్మాణం అందిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకుంటున్న జగనన్న.
* దేశ చరిత్రలో సగానికి సగం ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5 లక్షల కోట్లు పేదలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.
* అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకున్న జగనన్న.
* ఒక్కటంటే ఒక్క సంక్షేమాన్ని తీయనని చంద్రబాబు చెబుతున్నారు. 
* అదే నోళ్లతో ఏపి ....శ్రీలంక అయిపోతుందని చెబుతున్న వారే జగనన్న వెనకాల నడిచే పరిస్థితి. 
* ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. 
* జగనన్న తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థను హేళన చేసిన వారే ఇప్పుడు పాతిక ఇళ్లకు ఒకరిని పెడతామంటున్నారు.
* అమ్మ ఒడి ఎంత మందికైనా ఇస్తామంటున్నారు. 
* ప్రజలపై ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగనన్న.
* ఈ అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వమే మళ్లీ రావాలి. 
* సీఎం రోడ్డు, ఆస్పత్రులు, ఆర్డీవో ఆఫీసు, టౌన్‌ పోలీసుస్టేషన్‌.. ఇలా నందిగామలో చేసిన అభివృద్ధిని చూడండి. 
* జగనన్న దయ వల్లే ఇలా అభివృద్ధి జరిగింది. 

తాజా వీడియోలు

Back to Top