పెత్తందార్లు బాబు అండ్‌ కో...పేదల మనిషి జగనన్న

రాజానగరం సామాజిక సాధికార యాత్ర సభలో  మంత్రి జోగి రమేష్‌

పెత్తందార్ల‌కు తోడుగా ఢిల్లీ నుంచి ఓ జాతీయ పార్టీ రాబోతోంది.

పేదల మనిషి జగనన్నను ఓడించాలని కట్టకట్టుకుని వస్తున్నారు.

ఎంత మంది వచ్చినా పేదల మనిషి జగనన్నను ఏమీ చేయలేరు

వంగవీటి రంగా గారిని పొట్టనపెట్టుకుంది తెలుగుదేశం పార్టీనే

అటువంటి పార్టీ చంకలో దూరిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌

ముఖ్యమంత్రి పదవికి అర్హుడిని కాదు..అసెంబ్లీ గేటు తాకితే చాలంటున్నాడు: మంత్రి  జోగి రమేష్‌

తూర్పుగోదావ‌రి జిల్లా: పెత్తందార్లు చంద్ర‌బాబు అండ్‌ కో...పేదల మనిషి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటూ మంత్రి జోగి ర‌మేష్ అభివ‌ర్ణించారు. పెత్తందార్ల‌కు తోడుగా ఢిల్లీ నుంచి ఓ జాతీయ పార్టీ రాబోతుంద‌న్నారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా 2024 ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీదే విజ‌య‌మ‌ని, వైయ‌స్ జ‌గ‌న్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు.  తూర్పుగోదావ‌రి జిల్లా రాజానగరం సామాజిక సాధికార యాత్ర సభలో  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడారు.

పెత్తందార్లు బాబు అండ్‌ కో అయితే...పేదల మనిషి జగనన్న:
– పేదలకి, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం..ఈ యుద్ధంలో జగనన్న వైపు నిలబడి, ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు ఓటేయాలా అని ప్రజలంతా తహతహలాడుతున్నారు. 
– రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడను ఒక సారి గమనించండి. 
– పేదల పక్షాన, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,అగ్రవర్ణ పేదల పక్షాన నిలిచిన వ్యక్తి జగనన్న. 
– చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, లోకేశ్‌ వీళ్లంతా పెత్తందార్లు. 
– ఢిల్లీ నుంచి వీళ్లందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగుపెట్టబోతోంది. 
– పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషైన జగనన్నను ఓడించాలని అందరూ కలసి కట్టుగా కుట్రలతో రాబోతున్నారు. 
– బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలు, కాపులు..అందరూ ఈ ప్రభుత్వం నేడు భాగస్వాములు..
– రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన జగనన్న. 
– 9 రాజ్యసభ సభ్యుల్లో 4 స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. 
– ఎమ్మెల్సీ, ఛైర్మన్‌ల స్థానాలిచ్చారు. వారంతా సామాజిక సాధికారిక యాత్ర ద్వారా రాష్ట్రం అంతా తిరిగివస్తోంటే ప్రతిపక్షాలు బేంబెలేత్తిపోతున్నాయి. 

మంచిని ప్రేమించాలి..పేదల మనిషి జగనన్నను నిలబెట్టుకోవాలి:
– చంద్రబాబుని అడుగుతున్నా...రాజానగరంలో మా జక్కంపూడి రాజా పెట్టిన మీటింగుకు వచ్చిన జనం కూడా నీకు రాలేదు. 
– కొన్ని కోట్లు ఖర్చు బెట్టి తిరువూరులో చంద్రబాబు సభ పెడితే అది వెలవెలబోయింది. 
– మంచిని ప్రేమించాలి..నీతి,నిజాయితీలను గౌరవించాలి. పేదల పక్షాన నిలబడిన జగనన్నను నిలబెట్టుకోవాలి. 
– చంద్రబాబుకు తోడుగా పవన్‌ కల్యాణ్‌ కూడా వస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి పదవికి అర్హుడిని కాదు అంటున్నాడు. 
– నేను కనీసం అసెంబ్లీలోనైనా అడుగుపెట్టేందుకే చంద్రబాబు సంకనాకుతున్నానని స్పష్టంగా చెప్తున్నాడు. 
– విజయవాడ నగరంలో ఒక ధీరుడు వంగవీటి మోహన్‌రంగా గారిని పొట్టన పెట్టుకున్న వ్యక్తులు గురించి ఆలోచించండి. 
– ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగా గారిని పొట్టనపెట్టుకుంది ఈ తెలుగుదేశం పార్టీ..చంద్రబాబు అనేది గుర్తించాలి. 
– రంగా గారి అభిమానులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. రంగాగారిని పొట్టనపెట్టుకున్న పార్టీని మనం ఓడించాల్సిందే. 
– సైకిల్‌ గుర్తును తుక్కుతుక్కుగా విరగ్గొట్టాల్సిన బాధ్యత మనపైన ఉంది. 
– ఈ సమావేశం చూస్తే నూటికి నూరు పాళ్లు ఫ్యాన్‌ గుర్తుకు తిరుగులేదనేది స్పష్టం అవుతోంది. 

Back to Top