సీఎం స‌హాయ నిధికి రూ.10ల‌క్ష‌ల విరాళం

తాడేప‌ల్లి: కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి  రూ. 10 లక్షల రూపాయల చెక్కును  గుంటూరుజిల్లా ముప్పాళ్లకు చెందిన  కంచర్ల కృపారావు, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డిగారికి తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం అందచేశారు. 

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు రాష్ట్ర‌ అభివృధ్దికి,పేద వర్గాల సంక్షేమానికి చేస్తున్నకృషిలో భాగస్వామి అవ్వాలనే ఉద్దేశ్యంతో పదిలక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు కంచర్ల కృపారావు తెలియచేశారు.శ్రీ వైయస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృధ్దిలో ఇండియాలోోనే ముందుంటుందని అన్నారు.

కోవిడ్-19 ను ఎదుర్కొవడంలో శ్రీ వైయస్ జగన్ తీసుకుంటున్న చర్యలు ఆయన దూరదృష్టిని తెలియచేస్తున్నాయని వివరించారు.కార్యక్రమంలో అసెంబ్లీలో ఛీఫ్ మార్షల్  థియోఫిలా కూడా పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top